HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >The Miracle Of Ghee In Winter

Ghee : శీతాకాలంలో నెయ్యి చేసే అద్భుతం..

నెయ్యి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చర్మం ఆరోగ్యానికి, శారీరక, మానసిక బలానికి (జ్ఞాపకశక్తి) నెయ్యి మేలు చేస్తుంది.

  • Author : Maheswara Rao Nadella Date : 08-12-2022 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ghee Winter
Ghee

నెయ్యి (Ghee) మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చర్మం ఆరోగ్యానికి, శారీరక, మానసిక బలానికి (జ్ఞాపకశక్తి) నెయ్యి మేలు చేస్తుంది. ముఖ్యంగా శీతాకాలం (Winter)లో నెయ్యిని తప్పకుండా తీసుకోవాలి. అనేక మంది భోజన ప్రియులు నెయ్యి (Ghee) అంటే పడి చస్తారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోనిదే ముద్ద ముట్టని వారు కూడా అనేకం. అందుకే భారతదేశంలో నెయ్యి తినే పద్ధతి యుగయుగాలుగా కొనసాగుతోంది. నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి. నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందని కొందరు, మొటిమలు వస్తాయని ఇంకొందరు చెప్పడం ఎక్కువగా వింటూనే ఉంటాం. కాని పౌష్టికాహార నిపుణులు మాత్రం నెయ్యి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. నెయ్యితో శరీరంలో కొవ్వుల స్థాయి పెరిగిపోయి, మనకు హాని చేస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంటుంది.

నెయ్యితో బరువు పెరిగిపోతామన్న భయంతో దీన్ని దూరం పెట్టే వారు కూడా ఉన్నారు. నిజానికి నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. అన్నంలో నెయ్యి కలుపుకుని తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ వెంటనే రక్తంలో కలవకుండా నిదానంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. దానివల్ల బ్లడ్ గ్లూకోజ్ ఒక్కసారిగా పెరిగిపోదు. నెయ్యి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చర్మం ఆరోగ్యానికి, శారీరక, మానసిక బలానికి (జ్ఞాపకశక్తి) నెయ్యి మేలు చేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో నెయ్యిని తప్పకుండా తీసుకోవాలి. శీతాకాలంలో నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరానికి వేడినిస్తుంది. అధిక వేడిని (400 డిగ్రీల ఫారిన్ హీట్ వరకు) తట్టుకునే శక్తి నెయ్యికి ఉంది. కనుక వంటల్లో వాడుకోవచ్చు.

జీర్ణరసాల ప్రేరణకు నెయ్యి తోడ్పడుతుంది. అందుకే ఆహారంతో పాటు నెయ్యిని తీసుకోవడం వల్ల తిన్నది మంచిగా జీర్ణమవుతుంది. నెయ్యికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఉన్నాయి. కనుక దగ్గు, జలుబు తగ్గేందుకు సాయపడుతుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి రెండు చుక్కల చొప్పున రెండు నాసికా రంధ్రాల్లో వేసుకుంటే తక్షణ ఉపశమనం దక్కుతుంది. ఇక ఈ కాలంలో చర్మం పొడిబారి, చర్మ సమస్యలు కనిపిస్తుంటాయి. వీటికి నెయ్యి చక్కని పరిష్కారం. నెయ్యిని తీసుకోవడం వల్ల చర్మంలో తేమ శాతం పెరుగుతుంది.

చపాతీకి నెయ్యి జోడించండి: ఇక చపాతీ తినే వారు దానికి నూనెకు బదులు నెయ్యి జోడించుకోవడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్ గా మారిపోతుంది. దీనివల్ల మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉత్తరాదిలో చపాతీలను నెయ్యితో చేసుకుని తింటుంటారు. దీనివల్ల చపాతీల గ్లైసిమిక్ ఇండెక్స్ వ్యాల్యూ తగ్గుతుంది. అంటే బ్లడ్ గ్లూకోజ్ వెంటనే పెరగదు. హార్మోన్ల సమతుల్యతకు, బరువుతగ్గడానికి కూడా నెయ్యి సాయపడుతుంది.

Also Read:  Border Issue: కర్ణాటక మహారాష్ట్ర మధ్య ముదిరిన సరిహద్దు వివాదం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • ghee
  • health
  • Life Style
  • tips
  • winter

Related News

Health

Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

హైబీపీ (అధిక రక్తపోటు) అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. కారణం, చాలా మందిలో హైబీపీ ఉన్నప్పటికీ ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యక్తికి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాననే భావన ఉన్నప్పటికీ, లోపల గుండె, మెదడు, మూత్రపిండాలు మరియు కంటి రక్తనాళాలపై నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉం

  • Are you sleeping with your phone under your pillow?

    Sleeping With Phone: ఫోన్‌ను దిండు కింద పెట్టి పడుకుంటున్నారా..?

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd