HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >If Belly Fat Is Increasing It Means This Hormone Is High 2

Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • Author : Vamsi Chowdary Korata Date : 01-07-2026 - 2:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
If belly fat is increasing, it means this hormone is high!
If belly fat is increasing, it means this hormone is high!

అడ్డ్రినల్ గ్రంథులు కార్టిసోల్ (Cortisol) హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల హార్మోన్లు అవసరం.

హార్మోన్లు కూడా కెమికల్స్‌ లాంటివే; ఇవి మన రక్తప్రవాహం ద్వారా అవయవాలు, చర్మం, కండరాలు మరియు ఇతర కణజాలాలకు సందేశాలను తీసుకెళ్తాయి. ఇవి మన శరీరంలో జరిగే అనేక విధులను సమన్వయం చేస్తాయి. ఈ సంకేతాలు మీ శరీరానికి ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో తెలియజేస్తాయి. ఈ హార్మోన్లలో కార్టిసోల్ కూడా ఒకటి. అడ్డ్రినల్ గ్రంథులు కార్టిసోల్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. హైపర్‌టెన్షన్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మన నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది.

అయినప్పటికీ, ఏదైనా హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం. మన శరీరంలో కార్టిసోల్ స్థాయిలు పెరిగితే ఏమి జరుగుతుందని పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా వివరించారు. దీర్ఘకాలం పాటు మన శరీరంలో కార్టిసోల్ పెరుగుతూ ఉంటే.. మన ఆరోగ్యానికి మేలు బదులు ఎంతో నష్టం చేస్తుందని లవ్‌నీత్ బాత్రా అన్నారు.

ఈ సమస్యలు వస్తాయి:

  • బాగా ఒత్తిడికి గురైనా, కోపం వచ్చినా మన శరీరంలో కార్టిసోల్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మన శరీరం మరింత ఉత్తేజితమై, దాని ప్రభావం కండరాలమీద పడుతుంది. ఫలితంగా..
  • హైపర్‌టెన్షన్ పెరుగుతుంది.
  • బెల్లీ ఫ్యాట్, ఫేస్ ఫ్యాట్ పెరుగుతాయి.
  • కండరాల బలహీనత,
  • మూడ్ స్వింగ్స్,
  • ఎముకలు బలహీనపడటం,
  • జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.

ఎలా తగ్గించుకోవాలి?

  • ప్రశాంతంగా నిద్రపోండి
  • రెగ్యులర్‌గా వ్యాయామం చేయండి
  • ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోండి
  • ధ్యానం, ప్రాణాయామం చేయండి
  • మీకు ఇష్టమైన పనులు చేయండి (మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్ లాంటివి)

ఎంత ఉండాలి?

ఉదయం 6 నుంచి 8 గంటల వరకు: డెసి లీటర్‌కు 10 నుంచి 20 మైక్రో గ్రాములు (mcg/dL) ఉండాలి.

సాయంత్రం 4 గంటల సమయంలో: డెసి లీటర్‌కు 3 నుంచి 10 మైక్రో గ్రాములు (mcg/dL) ఉండాలి.

కార్టిసోల్ పెరిగిందని ఎలా తెలుస్తుంది?

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, శరీరంలో కార్టిసోల్ స్థాయిని మూత్రం, కఫం ద్వారా గుర్తించవచ్చు. దీనిని గుర్తించడానికి డాక్టర్లు టెస్టులు చేస్తారు.

ఈ ఆహారం తీసుకోండి:

గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, తాజా ఆకుకూరలు, జీడిపప్పు వంటివాటిలో ఉండే మెగ్నీషియం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీలు, నారింజ, జామ పండ్లు మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్లను సమన్వయం చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి. గుడ్లు, చేప, చికెన్, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చిక్కుడు గింజలు వంటివి మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇవి సెరోటోనిన్ స్థాయిలను పెంచి, ఆందోళనకు కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్‌ను తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • belly fat
  • belly fat diet
  • Belly Fat drinks
  • Belly Fat Reduction
  • Belly Fat remove
  • belly fat side effects
  • burn belly fat
  • Cortisol
  • Cortisol Level
  • Harmon Imbalance
  • health tips
  • hormone
  • hormones
  • Imbalance
  • Life Style
  • lose Belly Fat
  • remove Belly Fat
  • stress hormones
  • Stress Hormones/Cortisol
  • Tips for redycing Belly Fat

Related News

Struggling with work stress? Here’s how to relax!

Work Stress: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఇలా రిలాక్స్ అవ్వండి!

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేని మనిషి ఉండడు. కానీ ఆ ఒత్తిడి ఎక్కువైతే రోగాలు వస్తాయని, ఒత్తిడి తగ్గించుకోవాలని వైద్యులు చెప్తూనే ఉంటారు. ఇక అలాంటి ఒత్తిడి తగ్గాలంటే ఇక్కడ చెప్పే కొన్ని చిట్కాలను పాటించండి.. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇంటి ను

  • Do you have a habit of drinking alcohol? If so, be careful with its consumption...!!

    Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Anger and irritability... which vitamin deficiency causes them?

    Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

Latest News

  • Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్

  • AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • Toxic: ‘టాక్సిక్’ నుండి ‘లేడీస్ అండ్ లేడీస్’ గ్లింప్స్ విడుదల!

  • Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd