HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Follow These Weight Loss Diet For One Month

Weight Loss Diet : ఈ డైట్ ప్లాన్ తో నెలరోజుల్లోనే బరువు తగ్గండి

పెరిగిన బరువు ఎలా తగ్గాలన్నది చాలా మంది సమస్య. బరువు(Weight) తగ్గేందుకు డైటింగ్(Dieting) చేయాలనుకుంటారు కానీ ఇష్టమైన ఆహారం ఎదురుగా కనిపిస్తే తమను తాము నియంత్రించుకోలేరు.

  • Author : News Desk Date : 03-05-2023 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Follow these Weight Loss Diet for one month
Follow these Weight Loss Diet for one month

ఈ రోజుల్లో నూటికి 80 శాతం మందిని అధికంగా వేధిస్తోన్న సమస్య ఊబకాయం(Obesity). బరువు ఎలా పెరగాలి? అనేది కొందరి సమస్య అయితే పెరిగిన బరువు ఎలా తగ్గాలన్నది చాలా మంది సమస్య. బరువు(Weight) తగ్గేందుకు డైటింగ్(Dieting) చేయాలనుకుంటారు కానీ ఇష్టమైన ఆహారం ఎదురుగా కనిపిస్తే తమను తాము నియంత్రించుకోలేరు. అధిక బరువుకు ప్రధాన సమస్య ఇదే. అందుకే ఆకలి వేసినపుడే ఆహారాన్ని మితంగా తీసుకోవడం ముందు అలవాటు చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, పానిపూరి, పిజ్జాలు, బర్గర్లు, కేక్ లు, ఇతర ఆయిల్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. ఇలాంటి వాటన్నింటికీ కొన్నాళ్లు దూరంగా ఉంటే తప్ప బరువు తగ్గడం సాధ్యంకాని పని.

1.ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపిన నీరు తాగాలి. దీనివల్ల బరువు తగ్గరు కానీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

2.అల్పాహారంగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. రెండు ఎండిన ఖర్జూరాలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల శరీరంలో కొవ్వుతో పాటు పేరుకున్న నీరు యూరిన్ ద్వారా బయటికి వెళ్లిపోతుంది.

3.అల్పాహారం పూర్తయ్యాక ఉదయం 11 గంటల సమయంలో ఆకలిగా ఉంటే బొప్పాయి, పుచ్చకాయ, కమల, దానిమ్మ వంటి పండ్లను తినొచ్చు.

4.బరువు తగ్గడంలో దాల్చిన చెక్క పొడి కూడా సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్కపొడి, ఒక స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరిగిపోతుంది.

5.మధ్యాహ్నం తినే ఆహారంలో ఒక కప్పు బ్రౌన్ రైస్, రెండు గోధుమ పుల్కాలను రెండు రకాల కూరలతో తినాలి. వీటిలో ఆకుకూరలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

6.రాత్రి పూట 9 గంటలకు ఆహారం తినే అలవాటును మానుకోవాలి. వీలైనంత వరకూ రాత్రి 7 -8 గంటల మధ్యలో తినేయాలి. డిన్నర్ లో దాదాపు ఫ్రూట్స్ నే ఎక్కువగా తీసుకోవడం మంచిది. లేదంటే రెండు జొన్నరొట్టెలు ఎక్కువగా కూరతో కలిపి తినాలి.

7.పుల్కాలు, జొన్నరొట్టెల వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది కాబట్టి రోజుకి సరిపడా పలుచటి మజ్జిగ చేసుకుని ఉప్పు లేకుండా ప్రతిగంటకోసారి తాగుతుండాలి. మజ్జిగ వల్ల కూడా పేరుకున్న నీరు బయటికి పోవడంతో శరీరం తేలికగా ఉంటుంది.

8.వీటన్నింటికంటే ముందు వ్యాయామం చేయాలి. మీరు ఇప్పుడిప్పుడే డైట్ చేస్తున్నట్లయితే.. వాకింగ్, సైక్లింగ్ తో మొదలుపెట్టి నిదానంగా స్కిప్పింగ్, జంపింగ్ వంటివి చేస్తుండాలి.

9.లిక్విడ్ డైట్ తో 15 రోజుల్లో పూర్తిగా 10-15 కేజీల బరువు తగ్గొచ్చు. ఉదయం 8 గంటలకు వెజిటబుల్ జ్యూస్, 11 గంటలకు బత్తాయి జ్యూస్, మధ్యాహ్నం 2 గంటలకు మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్స్, సాయంత్రం 5 గంటలకు చెరకురసం, రాత్రి 7 గంటలకు దానిమ్మ రసం తాగాలి.

10.ఇలా 15 రోజులపాటు లిక్విడ్ డైట్ తీసుకుంటే.. అధిక బరువును ఈజీగా తగ్గొచ్చు. ఈ క్రమంలో నీరసంగా అనిపిస్తే.. మధ్యలో నిమ్మరసం తీసుకోవచ్చు. డైట్ చేస్తున్న సమయంలో కాఫీలు, టీ లకు ప్రాధాన్యమివ్వకూడదు. వీలైనంత వరకూ చక్కెర లేని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.

 

Also Read :  Face Glowing Face Packs : అందమైన ముఖం కోసం.. నేచురల్ ఫేస్ ప్యాక్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dieting
  • health tips
  • weight loss
  • Weight Loss Diet

Related News

Doctor explains stop peeing in the shower

స్నానం సమయంలో మూత్ర విసర్జన చేస్తున్నారా? ఆరోగ్యంపై ప్రభావం ఇదే

Bathing Vs Peeing  ప్రతి ఒక్కరికి రోజూ స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే, చాలా మంది స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తుంటారు. ఇది బయటికి చెప్పకపోయినా ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. అంటే స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేయాలన్న అనుభూతి కలుగుతుంది. అయితే, స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన అలవాటు మంచిదేనా? ఎవరిపై ప్రభావం ఉంటుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో డాక్టర్ కారంజ్ ఎస

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Hormonal Imbalance

    మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Latest News

  • Free Bus : రేపటి నుండి ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

  • Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందే ఓవర్సీస్‌లో రికార్డుల వేట

  • AP Govt : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ – ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

  • ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్

  • Drugs Case : రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd