Face Glowing Face Packs : అందమైన ముఖం కోసం.. నేచురల్ ఫేస్ ప్యాక్స్
ఆర్టిఫిషియల్ గా తెచ్చుకున్న అందం ఇట్టే ఆవిరైపోతుంది. అందుకే ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో నేచురల్ ప్యాక్స్ తో ముఖం అందంగా కనిపించేలా చేసుకోండి.
- By News Desk Published Date - 08:01 PM, Wed - 3 May 23
అందానికి చిరునామా అమ్మాయి. అందంగా(Beauty) కనిపించాలని అందరూ తహతహలాడుతుంటారు. కొందరు పుట్టుకతోనే అందంగా ఉంటే మరికొందరు అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్ల(Beauty Parlour) చుట్టూ తిరుగుతుంటారు. పార్లర్ కు వెళ్లడం మానేస్తే ఆర్టిఫిషియల్ గా తెచ్చుకున్న అందం ఇట్టే ఆవిరైపోతుంది. అందుకే ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో నేచురల్ ప్యాక్స్ తో ముఖం అందంగా కనిపించేలా చేసుకోండి. ముఖారవిందాన్ని పెంచే ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటి ? ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
1. ముఖం అందంగా, కాంతి వంతంగా కనిపించాలంటే.. మొదటిగా పాటించాల్సింది నీరు ఎక్కువగా తాగడం. చర్మం సహజంగా కాంతివంతంగా ముడతలు లేకుండా కనిపించాలంటే నీరు ఎక్కువగా తాగాలి. రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీరైనా తాగాలి.
2. గోధుమపిండి ఫేస్ ప్యాక్
ఒక స్పూన్ గోధుమపిండిలో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ పాలు, నాలుగు చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15 నిమిషాల పాటు నేచురల్ గా ఆరనిచ్చి.. కొన్ని పాలలో చిన్న దూది ముంచి ముఖంపై రుద్దాలి. మరో 10 నిమిషాల తర్వాత మరోసారి ముఖమంతా దూదితో పాలను రాసి.. నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న 2 గంటల వరకూ ఎలాంటి సోప్స్, ఇతర కెమికల్స్ తో కూడిన ఫేస్ వాష్స్ వాడకూడదు.
3. చియా ఫేస్ ప్యాక్
ముఖం అందంగా కనిపించేందుకు వేసుకునే ఫేస్ ప్యాక్ లలో ఇదీ ఒకటి. రెండుస్పూన్ల చియా విత్తనాల్లో సరిపడా పచ్చిపాలు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పెరుగు, విటమిన్ ఈ క్యాప్సుల్ వేసి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మంచినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల డెడ్ స్కిన్ పోయి.. చర్మం మృదువుగా ఉంటుంది.
4.ముఖంపై పట్టిన నలుపు పోవాలంటే పచ్చిపాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
5. టొమాటో- చక్కెర కలిపి ముఖంపై నెమ్మదిగా మర్దన చేయడం వల్ల కూడా నలుపు క్రమంగా తగ్గుతుంది. నల్లని మెడతో బాధపడే వారికి ఇది మంచి చిట్కా.
6. పెరుగులో పసుపు కలిపి ఈ మిశ్రమంలో పంచదార వేసి ముఖంపై మసాజ్ చేసుకుంటుండాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో కడిగేసుకోవాలి.
7. ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ఫేస్ గ్లో పెరగడంతో పాటు వయసును కూడా తగ్గిస్తుంది.
Related News
Turmeric: పసుపుతో అదిరే అందం మీ సొంతం.. బట్ బీ అలర్ట్, ఎందుకంటే
Turmeric: ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. కొందరు ఇంటిలో దొరికేవాటితో కూడా ప్రయత్నిస్తారు. తరచుగా ముఖానికి పసుపును ఉపయోగిస్తారు. అయితే పసుపును నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి మంచిదో కాదో తెలుసా? పసుపును శతాబ్దాలుగా చర్మానికి ఉపయోగిస్తున్నారు. కానీ పసుపును నేరుగా ముఖంపై పూయడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఇది కాక