Coffee For Beauty: కాఫీ పొడితో ఈ విధంగా చేస్తే చాలు ముఖంపై ముడతలు మాయం అవడం ఖాయం?
మీకు తెలుసా కాఫీ పొడి (Coffee Powder) కేవలం కాఫీ చేసుకొని తాగడానికి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో వాటికీ ఉపయోగపడుతుంది.
- By Vamsi Chowdary Korata Published Date - 04:03 PM, Sat - 27 January 24

Coffee For Beauty : మనం ప్రతిరోజు వినియోగించే వాటిలో కాఫీ పొడి కూడా ఒకటి. ఈ కాఫీ పొడిని మనం ఎక్కువగా కాఫీ (Coffee) చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. మీకు తెలుసా కాఫీ పొడి (Coffee Powder) కేవలం కాఫీ చేసుకొని తాగడానికి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో వాటికీ ఉపయోగపడుతుంది. కాఫీ పొడి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మీ చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు. అలాగే ముఖంపై ఉండే ముడతలు కూడా మాయం అవుతాయి. మరి కాఫీ పొడితో ముఖంపై ఉండే మడతలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
ఈ రోజుల్లో డిజిటల్ వాడకం పెరిగిపోవడంతో చాలామందికి డార్క్ సర్కిల్స్ సమస్య ఇబ్బంది పెడుతోంది. అయితే ఈ డార్క్ సర్కిల్స్ సమస్యను దూరం చేయడానికి కాఫీ పొడి ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కాఫీలోని విటమిన్ కె కళ్లకు ఉపశమనం అందిస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ కళ్ల కింద ఉండే చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా చేస్తుంది. కాఫీ పొడిలో కొద్దిగా చక్కెర కలుపుకొని మర్దన చేసుకుంటే డార్క్ సర్కిల్స్ దూరం అవుతాయి. డికాషన్‌ను కళ్ల చుట్టూ రుద్దినా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే కాఫీపొడి చర్మానికి మంచి స్క్రబ్ గా పని చేస్తుంది. ఇది చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది.
కాంతివంతమైన చర్మం కోసం స్నానం చేసే సమయంలో కాఫీ పొడిని నేరుగా చర్మంపై రుద్దుకుంటే చాలు. ముఖంపై ఉండే ముడతలు మాయం అవ్వడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే కాఫీపొడి మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. రెండు కప్పుల కాఫీ గింజలకు ఒక కప్పు నీటిని, కొన్ని చుక్కలు టీట్రీ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్ తో బాగా కలిపి, బ్రష్‌తో ముఖానికి రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు చర్మం పై పేరుకున్న మృతకణాలను కూడా తొలగిస్తుంది.
Also Read: Abhishek – Aishwarya : ఐశ్వర్యతో విడాకుల పుకార్లు.. అభిషేక్ బచ్చన్ పోస్ట్ వైరల్