HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >This Is The Secret Behind The Six Flavors In Ugadi Pachadi

Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో షడ్రుచుల వెనుక ఉన్న రహస్యం ఇదే..!

  • Author : Vamsi Chowdary Korata Date : 18-03-2026 - 12:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ugadi Pachadi Significance
Ugadi Pachadi Significance

Ugadi Pachadi  ప్రతి పండుగకీ ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుందనే విషయం తెలిసిందే. అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ నియమ నిష్టలతో తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో ఆరోగ్యాన్ని అందించే సుగుణాలు బోలెడుంటాయనే విషయం కూడా విధితమే. ఆ క్రమంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగకి చేసుకునే ఉగాది పచ్చడి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు రుచిలోనే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ.. ఉగాది పచ్చడి తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

తెలుగు వారి తొలి పండుగ ఉగాది. ఈ ఏడాది మార్చి 19వ తేదీన శ్రీపరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఉగాది పండుగ (Ugadi Festival) అంటేనే షడ్రుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడిలో వేసే తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు ఇలా ఒక్కో రుచి మనిషి జీవితంలోని ఒక్కో భావానికి ప్రతీక అని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఉగాది పచ్చడిలోని షడ్రుచుల అర్థం క్షుణ్నంగా తెలుసుకుంటే మనిషి జీవిత పరమార్థం అర్థమైనట్లేనని అంటారు.

అంతే కాకుండా సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను ఓర్పుతో, నేర్పుతో స్వీకరించాలన్న సందేశాన్ని కూడా ఉగాది పచ్చడి ఇస్తుంది. అయితే ఉగాది పచ్చడిలో వేసే ఆరు రుచులు సరిసమానంగా ఉన్నప్పుడే ఉగాది పచ్చడికి ఓ అర్థం. మరి ఇంకెందుకు ఆలస్యం అసలు సిసలైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు

Ugadi Pachadi

Ugadi Pachadi

  • కొత్త చింతపండు – 30 – 50 గ్రాములు
  • వేప పూత – 1 టేబుల్​ స్పూన్​
  • రాళ్ల ఉప్పు – సరిపడేంత​
  • బెల్లం – 2 టేబుల్​ స్పూన్లు
  • మామిడి పిందె – సైజుని బట్టి 1 లేదా 2
  • పచ్చిమిర్చి – చిన్నవి 1 లేదా 2 లేదా మిరియాలు – 15
  • చెరకు రసం -1/2 కప్పు​

ఉగాది పచ్చడి తయారీ విధానం

Ugadi 2026.

Ugadi 2026.

Step 1: మొదట పులుపు కోసం వేసే చింతపండును గింజలు, నార లేకుండా తీసుకోవాలి. ఈ చింతపండును ఒక కొత్త గిన్నెలో 250ml గోరువెచ్చని నీళ్లు పోసి పావుగంట సేపు నానబెట్టాలి. చేదు కోసం వేసే వేప పూత తీసుకుని మొగ్గలు, కాడలు లేకుండా వేప పూరేకులు మాత్రమే తీసుకుని ఓ ప్లేట్​లో పెట్టుకోవాలి.

Step 2: ఇక కారం కోసం వేసే మిరియాలు వేస్తే పొడి చేసుకోవాలి లేదా పచ్చిమిర్చి వేస్తే సన్నగా తురుముకోవాలి. తర్వాత రాళ్ల ఉప్పును మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. ఇక మామిడి కాయలు పులుపుతో ఉంటాయి కాబట్టి వగరు కోసం మామిడి పిందెలు తీసుకుంటే బాగుంటుంది.

Step 3: ఆ మామిడి పిందెలు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి. తీపి కోసం వేసే బెల్లాన్ని తురుముకోవాలి. ఇప్పుడు బాగా నానిన చింత పండును గట్టిగా పిండి గుజ్జు తీసుకుని పిప్పి పడేయాలి.

Step 4: ఆ చింతపండు గుజ్జులో వేప పూత, మిరియాలు లేదా పచ్చిమిర్చి తురుము, మామిడి ముక్కలు, రాళ్లఉప్పు మిశ్రమం, బెల్లం తురుము వేసి బెల్లం కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి. అంతే.. షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడి రెడీ.

వసంత లక్ష్మికి నైవేద్యంగా సమర్పించాలి

Vasantha Lakshmi

Vasantha Lakshmi

ఈ ఉగాది పచ్చడి సిద్ధమైన తర్వాత వసంత లక్ష్మిని ఆహ్వానించి అమ్మవారికి ఉగాది పచ్చడి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత స్వీకరించాలి. అంతేకాదు ఉగాది పచ్చడిని మనం తీసుకోవడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్లకు కూడా పంచిపెట్టాలి. ఈ ఉగాది పచ్చడి సేవనం జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను, మంచి చెడులను చవిచూడాలనే పచ్చి నిజాన్ని తెలియజేస్తుంది.

ఉగాది పచ్చడి తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం

Ugadi Special

Ugadi Special

తాయుష్యం వజ్ర దేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్ట వినాశంచ నింబకందళ భక్షణమ్‌

ఉగాది పచ్చడి రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు

Ugadi Pachadi.

Ugadi Pachadi.

ఉగాది పచ్చడిలో వేసే బెల్లం నిస్సత్తువ పోగొట్టి తక్షణ శక్తినిస్తుంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. National Library of Medicine అధ్యయనం ప్రకారం పోటాషియం ఉండటం వల్ల బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్‌ను నిరోధిస్తుంది. చింతపండు ఉష్ణ దోషాలు తగ్గుతాయని ఆయుర్వేదం సైతం చెబుతోంది. ఇక ఉప్పు త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను తొలగిస్తుంది. మామిడి పిందెల్లో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్‌ సీ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వేప పూలు కఫదోషాన్ని, క్రిమి దోషాలను, జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి. ఇక మిరియాలు చర్మవ్యాధులను అరికట్టడమే కాకుండా, జీర్ణశక్తిని పెంచుతాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Parabhava Nama Samvatsara
  • Sri Parabhava Nama Samvatsaram
  • ugadi
  • Ugadi 2026
  • ugadi 2026 telugu year name
  • Ugadi celebrations
  • Ugadi Festival
  • Ugadi festival special food
  • ugadi pachadi
  • Ugadi Pachadi benefits
  • Ugadi Pachadi health benefits
  • ugadi pachadi ingredients
  • Ugadi pachadi recipe

Related News

    Latest News

    • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

    • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

    • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

    • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

    • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd