HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Breaking Up With Aishwarya Rai Now Abhishek Bachchans Post On Divorce News Goes Viral

Abhishek – Aishwarya : ఐశ్వర్యతో విడాకుల పుకార్లు.. అభిషేక్ బచ్చన్ పోస్ట్ వైరల్

Abhishek - Aishwarya : అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా బచ్చన్ విడివిడిగా జీవిస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

  • By Pasha Published Date - 04:00 PM, Sat - 27 January 24
  • daily-hunt
Abhishek Aishwarya
Abhishek Aishwarya

Abhishek – Aishwarya : అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా బచ్చన్ విడివిడిగా జీవిస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుటుంబ సభ్యులతో విడిపోయిందని అనేక వార్తలు సోషల్ మీడియాలో గుప్పు మంటున్నాయి. స్కూల్ డే ఈవెంట్‌లో అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య ఒక్కరే పాల్గొన్నారు.  అభిషేక్ బచ్చన్ పెళ్లి ఉంగరాన్ని ధరించకుండానే ఇటీవల ఓ ఈవెంట్‌కు వెళ్లారు. ఎప్పుడూ ధరించే  ఉంగరాన్ని వేసుకోకపోవడం.. ఆ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్ల నడుమ అభిషేక్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘‘ఓటమి భయం కలలను నాశనం చేస్తుంది. కానీ ఆ ఓటమి నుంచి నేర్చుకుంటే కలలు నిజమవుతాయి’’ అని అభిషేక్ రాసుకొచ్చారు. అభిషేక్ ఈ పోస్ట్‌ ద్వారా ఐశ్వర్యతో తనకున్న సంబంధాన్ని చెప్పకనే చెబుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ మాట నిజమో కాదో కాలమే సమాధానం చెబుతుంది. ఏది ఏమైనా ఈ జంట విడాకులు ప్రకటించే దశలో ఉందని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. హై ప్రొఫైల్ బచ్చన్ కుటుంబం ప్రస్తుతానికి ఈవిషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడిందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్‌ల వివాహజీవితంలో విభేదాలు తలెత్తాయని.. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గతేడాది డిసెంబరు నుంచే మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యారాయ్‌ను అన్‌ఫాలో చేయడం అప్పట్లో ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. దీని తర్వాత, అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఈ విడాకుల వార్తలను ధృవీకరించేలా చేసింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఆద్య అనే కూతురు ఉంది. ఈ జంట తమ 16 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలని చూస్తున్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు విడిపోవడానికి కారణాలు ఏమిటో ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు. ఇదిలా ఉంటే ఇటీవల  అమితాబ్ బచ్చన్ ఓ ట్వీట్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “అంతా చెప్పారు, అంతా చేశారు, ఇప్పుడు చెప్పినది చేయాలి, ఏమి జరిగిందో చెప్పాలి” అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేస్తూ ఓ ఫోటోను పంచుకున్నారు. అయితే బచ్చన్ ట్వీట్‌ను అభిషేక్, ఐశ్వర్య విడాకులకు నెటిజన్లు లింక్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

Also Read :Ola E Bike : హైదరాబాద్‌లో ‘ఓలా ఈ-బైక్స్’.. ఛార్జీ కిలోమీటరుకు 5 మాత్రమే


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhishek - Aishwarya
  • Abhishek Bachchan
  • Aishwarya Rai Bachchan
  • Divorce News

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd