Eating Pulka! : పుల్కా తినే అలవాటుందా.. ఇది మీకోసమే..!
రొట్టెలను పెనంపై కాకుండా నేరుగా మంటపై కాల్చుకుని కొందరికి తినే అలవాటు . అలా చేసిన రొట్టెల రుచి చాలా మందికి ఇష్టం.
- Author : Maheswara Rao Nadella
Date : 08-04-2023 - 3:21 IST
Published By : Hashtagu Telugu Desk
Pulka : రొట్టెలను పెనంపై కాకుండా నేరుగా మంటపై కాల్చుకుని కొందరికి తినే అలవాటు . అలా చేసిన రొట్టెల రుచి చాలా మందికి ఇష్టం. దీంతో.. వీటిని రెట్టింపు సంఖ్యలో లొట్టలేసుకుంటూ తింటుంటారు. నూనె కూడా తక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయనే అభిప్రాయం ఉంది. అందుకే చాలా మంది గృహిణులు రొట్టెలను (Pulka) ఇలా నేరుగా మంటపై కాల్చేందుకు ఇష్టపడతారు. మరి ఈ అభిప్రాయాల్లో వాస్తవం ఉందా ? ఇలా చేసే రొట్టెలు నిజంగా ఆరోగ్యకరమా? లేదా చెడు ఫలితాలు ఏమీ ఉండవా? అంటే దీనికి సైన్స్ భిన్నమైన సమాధానమే ఇచ్చింది.
ఎన్విరాన్మెంటర్ సైన్స్ అండ్ టెక్సాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఓ వ్యాసంలో ఇలాంటి రొట్టెలు కొంత హాని చేస్తాయని తేలింది. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ నుంచి వెలువడే కార్బన్ డైయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ల కారణంగా ఆరోగ్యానికి హాని జరుగుతుందనే నిజాన్ని ఈ వ్యాసం తేల్చింది.
ఇక 2011లో ఆస్ట్రేలియా అండ్ న్యూజిల్యాండ్ ఫుడ్ స్టాండర్డ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్త మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. రొట్టెలను నేరుగా మంటపై పెట్టి కాల్చే సమయంలో క్యాన్సర్ కారకాలు వెలువడే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన ఆయన ఈ విషయాన్ని పూర్తిగా నిర్ధారించేందుకు మరింత ఘాడమైన పరిశోధన అవసరమని చెప్పారు . అంటే.. రొట్టెలను మంటపై కాల్చడం సురక్షితమని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని నిపుణులు చెప్తున్నారు..
Also Read: Nayantara Seva Bhavam : లేడీ సూపర్ స్టార్ నయనతార సేవా భావం..!