HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mrunal Thakur Social Media Popularity

సినిమా ఛాన్సులు లేకపోయినా ..పుకార్లతో అమ్మడికి ఫుల్ క్రేజ్.. !!

మృణాల్ ఎవరితో కొంచెం చొరవగా కనిపించినా, సోషల్ మీడియాలో అది పెద్ద హాట్ టాపిక్ అయిపోతోంది. గతంలో నటుడు సుమంత్‌తో దిగిన ఒక పాత ఫోటో బయటకు రాగానే, వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో ఆమెను ముడిపెడుతూ

  • Author : Sudheer Date : 05-02-2026 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mrunal Thakur Reveals Break
Mrunal Thakur Reveals Break

Mrunal Thakur : బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వెండితెరపై కన్నా సోషల్ మీడియా వార్తల్లోనే ఎక్కువగా సందడి చేస్తోంది. ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’గా చెరగని ముద్ర వేసుకున్న ఈమె, ఆ తర్వాత ‘హాయ్ నాన్న’తో మరో విజయాన్ని అందుకుంది. అయితే, విజయ్ దేవరకొండతో నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మృణాల్ కెరీర్ కాస్త మందగించింది. ప్రస్తుతం అడివి శేష్‌తో ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తున్నప్పటికీ, సినిమాల కన్నా ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లే ఆమెకు విపరీతమైన పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి.

మృణాల్ ఎవరితో కొంచెం చొరవగా కనిపించినా, సోషల్ మీడియాలో అది పెద్ద హాట్ టాపిక్ అయిపోతోంది. గతంలో నటుడు సుమంత్‌తో దిగిన ఒక పాత ఫోటో బయటకు రాగానే, వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో ఆమెను ముడిపెడుతూ వస్తున్న వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. తనకి ధనుష్‌తో కేవలం వృత్తిపరమైన సంబంధమే ఉందని మృణాల్ స్వయంగా వివరణ ఇచ్చినప్పటికీ, ఈ రూమర్లు ఆగకపోవడం విశేషం. దీనికి తోడు సిద్ధార్థ్ చతుర్వేదితో కూడా ఆమె క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

నిజానికి ఇలాంటి పుకార్లు మృణాల్‌ను నిరంతరం వార్తల్లో ఉంచుతూ ప్రేక్షకులకు టచ్‌లో ఉండేలా చేస్తున్నప్పటికీ, సుదీర్ఘ కెరీర్ దృష్ట్యా ఇవి ఆమెకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న మృణాల్, కేవలం గ్యాసిప్స్ వల్ల మాత్రమే హైలైట్ అవ్వడం ఆమె అభిమానులను కూడా కలవరపెడుతోంది. సినిమాల సక్సెస్ కన్నా తన డేటింగ్ రూమర్లే ఎక్కువగా చర్చకు వస్తుండటం పట్ల ఆమె కూడా అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా, ఒక హీరోయిన్‌కు ఉండాల్సిన క్రేజ్ మృణాల్‌కు పుష్కలంగా ఉందని, సరైన హిట్లు పడితే ఆమె రేంజ్ మరోలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mrunal Thakur
  • mrunal thakur news
  • mrunal thakur social media popularity

Related News

Mrunal Thakur Reveals Break

బ్రేకప్ ను బట్టబయలు చేసిన మృణాల్

మృణాల్ తన మాజీ భాగస్వామి అన్న మాటలను గుర్తుచేసుకుంటూ.. "నువ్వు చాలా ఇంపల్సివ్ (ఆవేశపూరితంగా) ఉంటావు, దీన్ని నేను భరించలేను. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు హీరోయిన్ కావడం నాకు నచ్చదు" అని అతను మొహం మీదే చెప్పేశాడని తెలిపారు

    Latest News

    • అండర్-19 వరల్డ్ కప్.. ఆరోసారి టైటిల్‌పై క‌న్నేసిన భారత్!

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • సినిమా ఛాన్సులు లేకపోయినా ..పుకార్లతో అమ్మడికి ఫుల్ క్రేజ్.. !!

    • గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలనం

    • జగన్ను ‘అష్టదిగ్బంధనం’ చేయబోతున్న బాబు – పవన్ ?

    Trending News

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

      • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd