Nayantara Seva Bhavam : లేడీ సూపర్ స్టార్ నయనతార సేవా భావం..!
నయనతార సేవా భావం గురించి ఆమె అభిమానులకు చిర పరిచయమే. ఆమె వీలు కుదిరినప్పుడల్లా భర్త విఘ్నేష్ శివన్ తో కలసి చెన్నై నగరంలోని పేదలకు సాయం చేస్తుంటుంది.
- Author : Maheswara Rao Nadella
Date : 08-04-2023 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
Nayantara Seva Bhavam : నయనతార సేవా భావం గురించి ఆమె అభిమానులకు చిర పరిచయమే. ఆమె వీలు కుదిరినప్పుడల్లా భర్త విఘ్నేష్ శివన్ తో కలసి చెన్నై నగరంలోని పేదలకు సాయం చేస్తుంటుంది. ఎక్కువగా వీధుల్లో ఒంటరిగా కనిపించే పేదలకు వస్తు సామాగ్రిని పంచుతుంది. ఇదే మాదిరి మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది.
ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగా.. భర్తతో కలసి నయనతార (Nayantara) వీధుల్లోని వారికి వస్తు సామగ్రిని అందించింది. వర్షం పడుతున్న సమయంలో బస్ షెల్టర్ వద్ద సేదతీరుతున్న వారికి సామాగ్రి అందిస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్ లోకి పోస్ట్ అయింది . భర్త విఘ్నేష్ శివన్ ఒక చేత్తో గొడుగు పట్టుకోగా, మరో చేత్తో కవర్ లను పట్టుకున్నాడు. నయనతార ఒక్కోటీ తీసుకుని అక్కడున్న పేదలకు అందిస్తోంది.
ఈ వీడియోని చూసిన ఆమె అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా లేడీ సూపర్ స్టార్ నయనతార అని ఒకరు అంటే.. వర్షంలో గూడు లేని పేదలకు సాయం చేస్తోందని కొందరు ప్రశంసిస్తున్నారు. గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి అని మరోకరు పేర్కొనడం గమనార్హం.
Also Read: Das Ka Dhamki: ఓటీటీలోకి దాస్ కా ధమ్కీ.. ఆరోజు నుండే