Tulsi : తులసి చెట్టు విషయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే?
తులసి (Tulsi) మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి, విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు.
- By Naresh Kumar Published Date - 04:40 PM, Sat - 18 November 23

Tulsi tree : భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క హిందువుల ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి, విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు. కాబట్టి తులసి మొక్కను పూజించడం వల్ల తులసి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మి తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో తరచూ దీపారాధన చేస్తూ పూజిస్తూ ఉంటారో ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు. తులసిని నిత్యం పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు.
We’re Now on WhatsApp. Click to Join.
అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొందరు తెలిసీ తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అలా తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల తులసి అనుగ్రహానికి బదులుగా అమ్మవారి ఆగ్రహానికి లోనవుతాము. మరి తులసి మొక్క విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి మొక్కను ఇంట్లో నాటుకోవడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు లభిస్తాయి. ఎండిన తులసి మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. అందుకే నిత్యం తులసి మొక్కకు నీళ్లు సమర్పిస్తూ ఉండాలి. అలాగే మాంసాహారం తిన్న సమయంలో స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన సమయంలో తులసి మొక్కను ముట్టుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. పొరపాటున ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆ తులసి మొక్క స్థానంలో మరో తులసి మొక్కను తీసుకువచ్చి నాటాలి.
ఎండిన తులసిని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఎండిన తులసి మొక్కను ఎక్కడపడితే అక్కడ తొక్కే ప్రదేశంలో పడేయకుండా పారుతున్న నీటి ప్రవాహంలో లేదంటే ఎవరూ తొక్కెన ప్రదేశంలో పాడేయాలి. ఎండిపోయిన తులసి మొక్కలను ఇంట్లో ఉంచడం శుభకరం. చాలామంది తెలియక ఎండిన తులసి మొక్కను కాలుస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అలా చేయడం వల్ల మనకు హాని కలుగుతుంది. తులసి మొక్కను తాకేటప్పుడు కూడా అశుభ్రంగా ఉన్నప్పుడు అస్సలు తాకకూడదు. స్నానం చేయకుండా మురికి చేతులతో అస్సలే ముట్టుకోకూడదు. అలాగే రాత్రి సమయంలో సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకూడదు.
ఒకవేళ తులసి మొక్కలు మీరు తులసి ఆకులు తీసుకోవాలి అనుకుంటే పూజకు ముందు లేదంటే ముందు రోజే ఆ ఆకులను తులసి మొక్క నుంచి కోసుకోవాలి. సాయంత్రం పూట తులసి ఆకులను శాస్త్రాలలో నిషేధించబడింది. తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలో పాదాల కింద లేకుండా చూసుకోవాలి. పొరపాటున కూడా తులసి మొక్కను తొక్క కూడదు. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఆ తులసి ఆకులను పాదాలతో తొక్కకూడదు. తులసి ఆకులు నేలపై పడి ఉంటే, వాటిని ఎంచుకుని మట్టిలో పాతి పెట్టండి. ప్రతిరోజూ తులసి పూజ చేసి ఉదయం, సాయంత్రం దీపం, ధూపం వెలిగించాలి.
Also Read: Fruit Peels: ఈ పండ్లను పొట్టు తీసి తింటున్నారా.. అయితే ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతున్నట్లే..!
Related News

Dreams : కలలో మీకు అవి కనిపించాయా.. అయితే వాటి అర్థం ఇదే?
కొన్నిసార్లు పీడకలలు వస్తే కొన్నిసార్లు మంచి కలలు (Dreams) కూడా వస్తూ ఉంటాయి.