Tirumala: తిరుమలలో దర్శనానికి 24 గంటల సమయం..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు (Tickets) లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
- Author : Vamsi Chowdary Korata
Date : 15-02-2023 - 11:03 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. మరోపక్క, నిన్న తిరుమల శ్రీవారిని 70,789 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,215 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో (Tirumala) నిన్న శ్రీవారి హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం లభించింది.
Also Read: BBC Letter to Employees: ఉద్యోగులకు బీబీసీ తాజా లేఖ..!