HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >South Africa Can Help Team India

టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించి అటు దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌పై గెలిస్తే సమీకరణం మరింత స్పష్టమవుతుంది.

  • Author : Gopi Date : 25-02-2026 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India
Team India

Team India: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా ప్రయాణం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ ఓటమితో సెమీఫైనల్ చేరడం భారత జట్టుకు ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. టీమ్ ఇండియా తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడానికి భారీ విజయాలను నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ దక్షిణాఫ్రికా జట్టు భారత్‌ను ఓడించి కష్టాల్లోకి నెట్టిందో ఇప్పుడు అదే జట్టు భారత్ సెమీఫైనల్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం చేసే అవకాశం కనిపిస్తోంది.

Also Read: యూట్యూబ‌ర్ అన్వేష్‌కు బిగ్ షాక్‌!

దక్షిణాఫ్రికా భారత్‌కు ఎలా సహాయపడగలదు?

ప్రస్తుత సమీకరణాల ప్రకారం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే తమ మొదటి మ్యాచ్‌ల్లో గెలిచి పటిష్టంగా ఉన్నాయి. ఫిబ్రవరి 26, 2026న (అనగా రేపు) ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ కీలక పోరులో దక్షిణాఫ్రికా గనుక వెస్టిండీస్‌ను ఓడిస్తే అది భారత్‌కు వరంలా మారుతుంది.

దక్షిణాఫ్రికా విజయం వల్ల భారత్‌కు కలిగే ప్రయోజనాలు

నెట్ రన్ రేట్ ఆందోళన తగ్గుతుంది: ఒకవేళ దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడిస్త భారత్ నెట్ రన్ రేట్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కేవలం తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే సరిపోతుంది.

జింబాబ్వేపై విజయం కీలకం: భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించి అటు దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌పై గెలిస్తే సమీకరణం మరింత స్పష్టమవుతుంది.

మార్చి 1న ‘నాకౌట్’ పోరు: ఈ ఫలితాల తర్వాత మార్చి 1న భారత్- వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ ఒక అనధికారిక ‘నాకౌట్’ మ్యాచ్‌గా మారుతుంది. ఆ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటారు.

ఒకవేళ రేపటి మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిస్తే మాత్రం భారత్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అప్పుడు టీమ్ ఇండియా తన తదుపరి మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి భారత అభిమానులంతా ఇప్పుడు టీమ్ ఇండియా గెలవాలని కోరుకోవడంతో పాటు రేపటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవాలని కూడా ప్రార్థించాల్సి ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC T20 world cup
  • south africa
  • sports news
  • T20 World Cup 2025 Semis
  • team india

Related News

Women's T20 World Cup: Pakistan routed by India again.

Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ చేతిలో మళ్లీ చిత్తైన పాకిస్థాన్..

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత జట్టు తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, ఆల్ రౌండర్ దీప్తి శర్

  • Brother... it's no joke! Vaibhav Suryavanshi has shattered records right from the start.

    Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd