BBC Letter to Employees: ఉద్యోగులకు బీబీసీ తాజా లేఖ..!
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో
- By Maheswara Rao Nadella Published Date - 10:59 AM, Wed - 15 February 23

ప్రముఖ మీడియా సంస్థ బీబీసీకి (BBC) చెందిన ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం మొదలైన సోదాలు.. రాత్రి తెల్లవార్లూ జరిగాయని, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్ పంపిన బీబీసీ.. తాజాగా మరో లేఖను పంపింది. అవసరమైన వారు.. అంటే బ్రాడ్ కాస్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారు మినహా మిగతా వారు ఆఫీసుకు రానక్కర్లేదని చెప్పింది. ఇంటి వద్ద నుంచే పనిచేయాలని మెయిల్ లో సూచించింది.
ఐటీ అధికారుల సోదాలకు సహకరించాలని మరోమారు సూచించింది. జీతానికి సంబంధించిన వివరాలను అడిగితే చెప్పాలని పేర్కొంది. అయితే, వ్యక్తిగత ఆదాయ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరంలేదని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, పన్ను ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతోనే బీబీసీ (BBC) ఆఫీసుల్లో సర్వే చేస్తున్నట్లు ఐటీ అధికారులు మంగళవారం వెల్లడించారు.
Also Read: Anemia: “రక్తహీనత” గండం.. పురుషులు, స్త్రీలపై ఎఫెక్ట్ ఇలా