HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Has Your Vehicle Been Issued A Traffic Challan Then Do This

మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

ముందుగా మీరు ప్రభుత్వం అందిస్తున్న అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో “Check Online Services” అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

  • Author : Gopi Date : 24-02-2026 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Traffic Challan
Traffic Challan

Traffic Challan: మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడితే ఇకపై కంగారు పడాల్సిన పని లేదు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమూ లేదు. ప్రభుత్వం ఈ ప్రక్రియ మొత్తాన్ని డిజిటలైజ్ చేసింది. దీనివల్ల మీరు కేవలం నిమిషాల్లోనే ఇంట్లోనే కూర్చుని మీ ఈ-చలాన్ (e-Challan) చెల్లించవచ్చు. క్యూలైన్లు ఉండవు, మధ్యవర్తుల ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించిన సరైన పద్ధతి తెలిస్తే చాలు. ఈ-చలాన్ అంటే ఏమిటి? దాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో ఇక్కడ సులభంగా తెలుసుకుందాం.

ఈ-చలాన్ అంటే ఏమిటి?

ఈ-చలాన్ అనేది ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే డిజిటల్ చలాన్. వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు కెమెరాల ద్వారా లేదా అక్కడే ఉన్న పోలీసుల ద్వారా ఈ చలాన్ జనరేట్ అవుతుంది. ఇది వాహన నంబర్ ఆధారంగా నమోదవుతుంది. దీని సమాచారం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో అందుతుంది.

Also Read: పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!

స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్: ఆన్‌లైన్‌లో ఇలా చెల్లించండి

అధికారిక పోర్టల్‌ను సందర్శించండి

ముందుగా మీరు ప్రభుత్వం అందిస్తున్న అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో “Check Online Services” అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

వివరాలను నమోదు చేయండి

ఇక్కడ మీరు మీ వాహనం నంబర్ (Vehicle Number), చలాన్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లలో ఏదో ఒకటి నమోదు చేయాలి. వివరాలను సబ్మిట్ చేయగానే మీ వాహనంపై పెండింగ్‌లో ఉన్న అన్ని చలాన్లు స్క్రీన్ మీద కనిపిస్తాయి. చలాన్ ఎందుకు పడిందో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు.

పేమెంట్ పూర్తి చేయండి

మీరు ఏ చలాన్ అయితే చెల్లించాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకుని “Pay Now” బటన్ మీద క్లిక్ చేయండి. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. పేమెంట్ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ రశీదు వస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా సేవ్ చేసుకోవడం మర్చిపోకండి.

చలాన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు

మీ వాహనంపై ఏదైనా చలాన్ పెండింగ్‌లో ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా ఇదే పద్ధతిని అనుసరించండి. ఒకవేళ స్క్రీన్ మీద “Challan Not Found” అని వస్తే, మీ వాహనంపై ఎలాంటి జరిమానా లేదని అర్థం.

  • ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి
  • ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ల ద్వారా మాత్రమే చెల్లింపులు చేయండి.
  • అనుమానాస్పద లింకులు, కాల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా పేమెంట్ చేయకండి.
  • చలాన్ చెల్లించిన తర్వాత రశీదును భద్రపరుచుకోండి.
  • సకాలంలో చలాన్ చెల్లించకపోతే జరిమానా పెరిగే అవకాశం ఉంటుంది లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Automobiles
  • e-challan
  • Traffic challan
  • traffic rules

Related News

Highway Travelers

హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

ఈ కొత్త వ్యవస్థ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. టోల్ ప్లాజాల వద్ద సమయం ఆదా అవుతుంది. పొడవైన క్యూలు తగ్గుతాయి.

  • Second-Hand Car

    సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? అయితే జాగ్ర‌త్త‌!

  • VinFast VF MPV 7

    భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • PM E-DRIVE

    పీఎం ఈ-డ్రైవ్ ప‌థ‌కాన్ని పొడిగించిన కేంద్రం.. ఎవ‌రు అర్హులు అంటే?!

  • Ola S1 X Electric Scooter

    అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చిన ఓలా.. రూ. 49,999కే ఎలక్ట్రిక్ వాహనం!

Latest News

  • Vijayawada : ఆర్టీసీ బస్ కండక్టర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ

  • Tihar Jail : తీహార్ జైలుపై కవిత కీలక వ్యాఖ్యలు

  • World Health Day : ఆరోగ్యమే మహాభాగ్యం- సంపాదన కంటే శరీరమే ముఖ్యం!

  • Husband kills wife in Sangareddy : ప్రియుడితో పారిపోయిన భార్యను హత్య చేసిన భర్త

  • Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్న ప్రభుత్వం

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd