Allu Arjun: కొనసాగుతున్న విచారణ.. ఆ విషయంలో తప్పు ఒప్పుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!
అల్లు అర్జున్ ను పోలీసులు 18 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ చెప్పే ప్రతి ఆన్సర్ ను వీడియో ద్వారా పోలీసులు రికార్డు చేస్తున్నారు. అల్లు అర్జున్ స్టేట్ మెంట్ వీడియో రికార్డ్ తో పాటు మరో వైపు టైపింగ్ కూడా చేస్తున్నారు.
- By Gopichand Published Date - 02:25 PM, Tue - 24 December 24

Allu Arjun: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు గత రాత్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. అయితే సుమారు 12 గంటల నుంచి అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది.
అల్లు అర్జున్ ను పోలీసులు 18 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ చెప్పే ప్రతి ఆన్సర్ ను వీడియో ద్వారా పోలీసులు రికార్డు చేస్తున్నారు. అల్లు అర్జున్ స్టేట్ మెంట్ వీడియో రికార్డ్ తో పాటు మరో వైపు టైపింగ్ కూడా చేస్తున్నారు. సంధ్య థియేటర్ లోపలికి వస్తున్న వీడియో.. లోపల కూర్చున్న వీడియో, బయటకు వెళ్తున్న వీడియోలను పోలీసులు అల్లు అర్జున్‌కు చూపినట్లు సమాచారం. వీడియోలు చూపించి ప్రశ్నలు అడగడంతో ఐకాన్ స్టార్ మౌనం వహించినట్లు తెలుస్తోంది.
Also Read: Vijay Devarakonda Rashmika : విజయ్, రష్మిక.. సీక్రెట్ ట్రిప్ ఎక్కడికి..?
రేవతి మృతిపై పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసినా బన్నీ తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లు సమాచారం. ఇలా జరుగుతుందని ఊహించలేదని అల్లు అర్జున్ చెప్పారని తెలుస్తోంది. తన పీఆర్ టీమ్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని బన్నీ స్వయంగా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా 50 మందికిపైగా బౌన్సర్లను పెట్టడం తన తప్పేనని అల్లు అర్జున్ ఒప్పుకున్నాడని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ వద్దనుకున్నట్లు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఇప్పటికే జైలుకెళ్లొచ్చిన అల్లు అర్జున్ మరోసారి పోలీసు విచారణకు హాజరయ్యాడు. ఏసీపీ ఆధ్వర్యంలోని టీం.. ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే సమయంలో కీలకమైన బౌన్సర్ల అంశాన్ని పోలీసులు ప్రస్తావించారు. బౌన్సర్లపై పోలీసులు వేసిన ప్రశ్నలకు.. అల్లు అర్జున్ నుంచి సరైన సమాధానం రాలేదంట. ‘‘ మర్చిపోయాను.. నాకు తెలియదు.. గుర్తులేదు’’ అని చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
బన్నీ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు
ఒకవైపు చిక్కడపల్లి PSలో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుండగా మరోవైపు అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆయన ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇటీవల బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడి చేసి విషయం తెలిసిందే. ఈక్రమంలోనే మరోసారి దాడి జరగకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.