Vijay Devarakonda Rashmika : విజయ్, రష్మిక.. సీక్రెట్ ట్రిప్ ఎక్కడికి..?
Vijay Devarakonda Rashmika విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ఎప్పుడు సీక్రెట్ ట్రిప్ లు వేస్తుంటారు. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పెట్టే ఫోటోలు క్లియర్
- By Ramesh Published Date - 02:23 PM, Tue - 24 December 24
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మధ్య ఏదో జరుగుతుంది అన్నది తెలిసిందే. ఇద్దరు రెండు సినిమాల్లో నటించగా అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని కొందరు అంటుంటే కాదు కాదు ఫ్రెండ్ షిప్ కి మించి మరేదో ఉందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా రష్మిక విజయ్ దేవరకొండ మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఐతే వారు చేసే పనులు కూడా ఇలాంటి వారికి వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ఎప్పుడు సీక్రెట్ ట్రిప్ లు వేస్తుంటారు. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పెట్టే ఫోటోలు క్లియర్ గా చూస్తే రష్మిక (Rashmika) షేర్ చేసే ఫోటోల రిఫరెన్స్ లు ఉంటాయి. ఐతే ఇద్దరు ఇలా సీక్రెట్ ట్రిప్ లు వేయడం చాలా కామన్.
లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు మరో జాలీ ట్రిప్ వేసినట్టు ఉన్నారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో విజయ్ అలా వచ్చి వెళ్లాడో లేదో వెంటనే రష్మిక కూడా వచ్చింది. ఇద్దరు కలిసి వస్తే మీడియా ఆడేసుకుంటుందని ఇలా ప్లాన్ చేశారని అనిపిస్తుంది. మరి ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్లారా.. ఇద్దరు వేరు వేరు చోట్లకి వెళ్లారా అన్నది తెలియదు. . ఏది ఏమైనా ఈ ఇద్దరు వారి మధ్య ఉన్న రిలేషన్ ఏంటన్నది బయట పెట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. విజయ్ ప్రస్తుతం గౌతం తిన్ననూరి సినిమాతో బిజీగా ఉంటే రష్మిక ఈమధ్యనే పుష్ప 2 హిట్ తో ఫుల్ జోష్ లో ఉంది.