Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు టీజర్ వచ్చేసింది.. రవితేజ ఈ సారి హిట్ కొట్టేలా ఉన్నాడే..!
మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమా టీజర్ వచ్చేసింది.
- Author : Gopichand
Date : 17-08-2023 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమా టీజర్ వచ్చేసింది. టైగర్ దండయాత్ర అంటూ ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ గురువారం రిలీజ్ చేసింది. 1970లో దేశంలో అతిపెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. యువ డైరెక్టర్ వంశీ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Inspired from the true rumours – How’s #TigerNageswaraRao teaser? pic.twitter.com/KFHiKLeXFp
— Aakashavaani (@TheAakashavaani) August 17, 2023
Also Read: Raghuvaran B.Tech: రఘువరన్ బీటెక్ మళ్లీ వస్తున్నాడు, వందకు పైగా థియేటర్లలో రీ రిలీజ్!
ఇక 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళి శర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హైవోల్టేజ్‍తో టైగర్ నాగేశ్వరరావు టీజర్ సినిమాపై అంచనాలను మరింత భారీగా పెంచేసింది. ఈ మూవీలో రవితేజ సరసన నుపుర్ సనన్ నటిస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అంచనాలు అమాంతం పెంచేశాయి. టీజర్ కూడా అద్భుతంగా ఉండటంతో టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం రవితేజ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా రేంజ్‍లో రూపొందుతోంది. టీజర్ కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అయింది.