HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sai Pallavi In Ram Charans Next Movie

Sai Pallavi: రామ్ చరణ్ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి..?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సినిమా కోసం కలిసి పని చేయనున్నారు. ఈ మూవీ మేకర్స్ సాయి పల్లవి (Sai Pallavi)ని హీరోయిన్ పాత్ర కోసం ఒక ఎంపికగా పరిశీలిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

  • Author : Gopi Date : 18-11-2023 - 11:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sai Pallavi
Compressjpeg.online 1280x720 Image 11zon

Sai Pallavi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సినిమా కోసం కలిసి పని చేయనున్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ఇటీవలే పూర్తయిందని తెలుస్తోంది. పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేసే పనిలో బుచ్చిబాబు టీమ్ బిజీగా ఉంది. ప్రస్తుతం అందుతున్న వార్తల ప్రకారం.. ఈ మూవీ మేకర్స్ సాయి పల్లవి (Sai Pallavi)ని హీరోయిన్ పాత్ర కోసం ఒక ఎంపికగా పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ చర్చలపై ఇంకా క్లారిటీ లేదు కానీ రూమర్లు మాత్రం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ న్యూస్ నిజం కావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: Tiger Nageswara Rao: ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు

గార్గి మూవీ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సాయి పల్లవి రీసెంట్ గా కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమాకి సాయి పల్లవి సైన్ చేసింది. బుచ్చిబాబు, అతని బృందం రామ్ చరణ్ తదుపరి మూవీలో హీరోయిన్ పాత్ర కోసం సరైన నటి కోసం వెతుకుతున్నారు. ఈ మూవీకి ఇప్పటికే ఎఆర్ రెహమాన్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంతో వెంకట సతీష్ కిలారు నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రం తరువాత నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో మొదటి చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కూడా సహనిర్మాతలుగా ఉంటున్నారు. అయితే రామ్ చరణ్ 16వ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం విజయ్ సేతుపతిని కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మరి RC16 మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి ఉంటుందో లేదో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Buchi Babu
  • Game Changer
  • movie updates
  • ram charan
  • RC 16
  • sai pallavi
  • tollywood

Related News

Allu Arjun's 'Raka' – When is the release date?

RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’కి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్, హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్నంటే అంచనాలు నె

    Latest News

    • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

    • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

    • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd