HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Producer Naga Vamsis Shocking Comments Happy After Six Years

నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్..ఆరేళ్ల తర్వాత హ్యాపీ

  • Author : Vamsi Chowdary Korata Date : 17-01-2026 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Producer Naga Vamsi
Producer Naga Vamsi

Producer Naga Vamsi  సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. థాంక్యూ మీట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఆరేళ్ల తర్వాత నాకు సంపూర్ణ సంతృప్తినిచ్చిన సంక్రాంతి ఇది. ప్రేక్షకులు, మీడియా, డిస్ట్రిబ్యూటర్ల మద్దతుతో ఈ విజయం సాధ్యమైంది” అన్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న చిత్రం అనగనగా ఒక రాజు . యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, యువత థియేటర్లకు క్యూ కడుతున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరి నటించారు. నవీన్ పొలిశెట్టి టైమింగ్, డైలాగ్ డెలివరీ, కామెడీ సెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, మీనాక్షి చౌదరి గ్లామర్‌తో పాటు నటనతో కూడా మంచి మార్కులు కొట్టింది. టెక్నికల్‌గా కూడా సినిమా బలంగా నిలిచింది. కథనానికి తగ్గట్టుగా సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ఎనర్జీని అందించగా, సినిమాటోగ్రఫీ రంగుల పండుగ వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించింది. ఎడిటింగ్ పటిష్టంగా ఉండటంతో కథ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. మొత్తం మీద పక్కా సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా ‘అనగనగా ఒక రాజు’ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

సినిమాకు వస్తున్న టాక్ కూడా అంతే పాజిటివ్‌గా ఉంది. “చాలా రోజుల తర్వాత థియేటర్లలో కడుపుబ్బా నవ్వుకున్నాం”, “ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా” అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బలమైన మౌత్ టాక్ ప్రభావంతో విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, ఈ చిత్రం నిలకడగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సంక్రాంతి రేసులో కీలక విజేతగా మారింది. ఈ విజయం నేపథ్యంలో చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఆరేళ్ల తర్వాత నాకు నిజమైన సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ తర్వాత అంతటి తృప్తిని ఇచ్చిన పండగ ఇదే. ఈ స్థాయి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు. అలాగే సినిమా విషయంలో మీడియా ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ, “చాలామంది నిర్మాతలు కూడా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. అందరి ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైంది. సోషల్ మీడియాలో అభిమానులు చూపుతున్న ప్రేమ అమోఘం. వాళ్లందరిని సంతోషపెట్టే ఒక భారీ అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుంది” అని చెప్పారు. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు తగినన్ని థియేటర్లు కేటాయించి అండగా నిలిచారని, అందువల్లే రెండు రోజుల్లో రూ.41 కోట్లకు పైగా గ్రాస్ సాధ్యమైందని వెల్లడించారు. నవీన్ పొలిశెట్టిపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తూ, “ఈ ప్రత్యేకమైన విజయంలో భాగమై, పూర్తి మద్దతు ఇచ్చిన నవీన్‌కు ధన్యవాదాలు” అన్నారు. అలాగే ఏడాది పాటు ఇతర సినిమాలు ఒప్పుకోకుండా ఈ సినిమాకు పూర్తిగా సమయం కేటాయించిన మీనాక్షి చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. సరదాగా, “ఆమెను అలా వేరే సినిమాలు ఒప్పుకోకుండా ఉండమన్నందుకు నా బుర్ర తినేసేది” అంటూ నవ్వులు పూయించారు. నాగవంశీ నిర్మాతగా చేసిన ‘గుంటూరు కారం’లో కూడా మీనాక్షి చౌదరి నటించిన విషయం తెలిసిందే. మొత్తంగా, నవ్వులు, వినోదం, పాజిటివ్ వైబ్స్‌తో ‘అనగనగా ఒక రాజు’ ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు పూర్తి స్థాయి పండగ అనుభూతిని అందిస్తూ, బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా పరుగులు పెడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anaganaga oka raju
  • Blockbuster Film
  • Naga Vamsi
  • Naveen polishetty
  • Sankranti
  • tollywood

Related News

Sankranthi Toll Gate

Sankranti : మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు వేస్తున్న పల్లెవాసులు

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు వెలవెలబోతున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు మరియు బంధుమిత్రుల కోలాహలంతో గత కొన్ని రోజులుగా పండగ చేసుకున్న ప్రజలు

  • సంక్రాంతి బరిలో దిల్ రాజు కు కాసుల వర్షం కురిపిస్తున్న మూడు సినిమాలు

  • Spirit Release Date

    ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే!

  • Sankranthi 2026 Box Office Bonanza

    సంక్రాంతి 2026 విన్నర్ ఎవరో తేలిపోయింది.. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్‌, నవీన్‌. ?

  • Mana Shankara Varaprasad Garu

    మెగాస్టార్ సినిమాకు కొత్త స‌మ‌స్య‌.. ఏంటంటే?

Latest News

  • వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

  • CBN : నేడు రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

  • నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్..ఆరేళ్ల తర్వాత హ్యాపీ

  • Actress Sharada : నటి శారదకు ప్రతిష్ఠాత్మక అవార్డు

  • Jobs : రెండేళ్లలో 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం – సీఎం రేవంత్

Trending News

    • జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!

    • రోహిత్ శర్మకు అవమానం జ‌రిగింది.. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కార‌ణ‌మిదే?!

    • ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడ‌ల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!

    • బంగారం కొనాల‌నుకునేవారికి బిగ్ అల‌ర్ట్‌.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd