HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actor Shivaji Rajas Father Rama Raju Passes Away

నటుడు శివాజీరాజా తండ్రి రామరాజు కన్నుమూత

  • Author : Vamsi Chowdary Korata Date : 03-03-2026 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Actor Sivaji Raja's Father G. Ramaraju Passes Away
Actor Sivaji Raja's Father G. Ramaraju Passes Away

Shivaji Raja  సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం మధురానగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వయోభారం కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తండ్రి మృతితో శివాజీ రాజా కుటుంబం శోకసంద్రంలో మునిగింది. 1962లో భీమవరంలో జన్మించిన శివాజీ రాజా, 1985లో ‘కళ్ళు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 400కు పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు.

  • నటుడు శివాజీరాజా కుటుంబంలో విషాదం
  • ఆయన తండ్రి రామరాజు కన్నుమూత
  • కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న రామరాజు

సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధురానగర్‌లోని స్వగృహంలో ఉదయం 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. వయోభారం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కన్నుమూసినట్లు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటల లోపు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

శివాజీరాజా … 1962 , ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో రామరాజు – చంద్రావతి దంపతులకు జన్మించారు. తండ్రి రామరాజు భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజీలో అటెండర్‌గా పనిచేశారు. హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసిన శివాజీ రాజా తర్వాత నటనపై ఆసక్తితో శిక్షణ తీసుకుని ఆ తర్వాత కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లి సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1985లో విడుదలైన ‘కళ్ళు’ చిత్రంతో ఆయన తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా శివాజీ రాజాకు మంచి గుర్తింపు లభించింది. ఇదే సినిమాకు ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. అనంతరం హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కొన్ని సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో శివాజీ రాజా 400కు పైగా సినిమాలు, అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. ‘పెళ్లిసందడి’, ‘సిసింద్రీ’, ‘ఘటోత్కచుడు’, ‘మురారి’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు గుర్తుండిపోయేలా నిలిచాయి. టెలివిజన్ రంగంలో ‘అమృతం’ సీరియల్‌లో ఆయన పోషించిన పాత్ర విశేష ప్రజాదరణ పొందింది. అలాగే ‘సంబరాల రాంబాబు’ వంటి కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘మెగుడ్స్ పెళ్లామ్స్’ సినిమా ద్వారా హీరోగానూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా పరిశ్రమకు సేవలందిస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగానూ శివాజీ రాజా బాధ్యతలు నిర్వహించారు. తన ప్రత్యేక హాస్యశైలి, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన శివాజీ రాజ కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Shivaji Raja
  • G Ramaraju Passes Away
  • hyderabad
  • shivaji raja
  • tollywood

Related News

Do we not have the standing to meet NTR? This is the reason why we have come before the media!

RAW NTR: ఎన్టీఆర్ ను కలిసే అర్హత మాకు లేదా? మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే!

టాలీవుడ్‌లో స్టార్ హీరోల అభిమాన సంఘాల మధ్య అంతర్గత వివాదాలు, ఆరోపణలు అప్పుడప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఒక సరికొత్త వివాదం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ అభిమానులతో కూడిన ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా ‘ఊరు వాడా’ అనే కొత్త పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. అయితే ఈ పోస్టర

  • Good news for burger lovers: Burger Singh restaurant opens in Hyderabad.

    Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం

  • Drug scare in Hyderabad: MLC's son arrested while attempting to purchase drugs.

    Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్‌

  • Controversy over 'Kalma' homework at a private school in Hyderabad; teacher wrote in the diary instructing students to read the Quran.

    హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో కల్మా’ హోంవర్క్ వివాదం.. ఖురాన్ చదవాలంటూ డైరీలో రాసిన టీచర్

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd