HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Euphoria Movie Review

యుఫోరియా మూవీ రివ్యూ

  • Author : Vamsi Chowdary Korata Date : 06-02-2026 - 10:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Euphoria Movie Review
Euphoria Movie Review

Euphoria Movie Review  సొగసు చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. ఎంతోమంది స్టార్స్‌తో పని చేసిన ఆయన కొత్త యాక్టర్స్‌తో కొత్త కథతో కొత్త జనరేషన్‌కి దగ్గరవ్వాలని తీసిన సినిమా ‘యుఫోరియా’. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమ ా చేశానంటూ ప్రెస్ మీట్‌లో గుణశేఖర్ చెప్పారు. అలానే భూమిక కూడా ఈ మూవీ ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఎమోషనల్‌గా కూడా యుఫోరియా కనెక్ట్ అవుతుందని ఆడియన్స్ అనుకున్నారు.

ధురంధర్ సినిమాతో ఎంతోమందికి క్రష్ అయిపోయిన సారా అర్జున్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. అలానే భూమిక, గౌతమ్ మీనన్, విఘ్నేష్ గవిరెడ్డి, నాజర్ సహా పలువురు కీలకపాత్రలు పోషించారు. మరి జెన్ జీని (జనరేషన్ Z) దృష్టిలో పెట్టుకొని తన మార్క్‌కి భిన్నంగా గుణశేఖర్ తీసిన ఈ సబ్జెక్ట్ ఆడియన్స్‌కి ఎంతగా కనెక్ట్ అయింది? సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

యూత్ చూడాల్సిన కథ
సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న చైత్ర (సారా అర్జున్) అనే అమ్మాయిని పబ్‌లో పరిచయమైన ఐదుగురు కుర్రాళ్లు తమతో పాటు కారులో తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకి చెప్పి, ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇస్తుంది చైత్ర. ఆ అమ్మాయి మైనర్ కావడంతో పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి ఐదుగురి కుర్రాళ్లని అరెస్ట్ చేస్తారు.

అయితే ఈ ఐదుగురు కుర్రాళ్లు కూడా మైనర్లే.. అందులోనూ సమాజంలో పలుకుబడి ఉన్న పెద్ద కుటుంబాలకి సంబంధించిన పిల్లలు. అందులో ప్రముఖ విద్యా సంస్థల ప్రిన్సిపల్ వింద్య వేములపల్లి (భూమిక) కొడుకు వికాశ్ (విఘ్నేష్ గవిరెడ్డి) కూడా ఉంటాడు. అయితే పిల్లలకి పాఠాలు చెప్పే వింద్య తన కొడుకుతో పాటు తప్పు చేసిన మిగిలిన నలుగురికి కూడా గుణపాఠం చెప్తుంది. ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనల్ జయదేవ్‌ (గౌతమ్ మీనన్)‌కి కీలక ఆధారం అప్పగించి ఆ ఐదుగురికి శిక్ష పడేలా చేస్తుంది.

అయితే జైలు జీవితం గడుపుతున్న వికాశ్‌లో మార్పు వచ్చిందా? తన కొడుకుని సరైన మార్గంలో పెట్టలేకపోయినందుకు వింద్య ఎంత బాధపడింది? చివరికి కొడుకుని పెరోల్ మీద తీసుకొచ్చిన వింద్య అసలు లక్ష్యం నెరవేరిందా? అనేది మిగిలిన కథ.

బౌండరీ దాటిన గుణశేఖర్
ఫ్యాషన్ పేరుతో సమాజంలో ప్రస్తుతం పెరిగిపోతున్న విచ్చలవిడితనం, యువతని పాడు చేస్తున్న డ్రగ్స్ వినియోగం, క్షణికావేశంలో చేసే ఒక్క తప్పు వల్ల జీవితాంతం పడే శిక్ష.. ఇలా అనేక కోణాలని స్పృశిస్తూ ఈ కథని రాసుకున్నారు గుణశేఖర్. ముఖ్యంగా యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గుణశేఖర్ ముందే చెప్పారు. అందుకు తగ్గట్లే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఫస్టాఫ్ ముగిసేవరకూ చాలా వరకూ మనం న్యూస్‌లో చూసిన పలు సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి.

మైనర్ల మీద అత్యాచారం అనే వార్త విన్న ప్రతిసారి తెలీకుండానే మనలో ఒక కోపం, ఆవేశం కట్టలు తెంచుకుంటూ ఉంటాయి. కానీ పెరుగుతున్న క్రైమ్ రేటు, మైనర్లపై అఘాయిత్యాలు చూస్తూ చూస్తూ, వింటూ వింటూ మనకి కూడా అలవాటు అయిపోయింది. అయితే మైనర్లు క్రైమ్స్ చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఏంటి..? అసలు వాళ్లు అలా తయారవ్వడానికి ప్రధాన కారణం పెద్దలు కాదా? అనే కోణంలో ఈ కథని ముందుకు తీసుకెళ్లారు గుణశేఖర్.

ఈ విషయాలు సమాజానికి చాలా ముఖ్యం. అది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఇలాంటి సబ్జెక్ట్‌ని వీలైనంత హార్డ్ హిట్టింగ్‌గానే చెప్పాలని గుణశేఖర్ అనుకున్నారు. అది స్క్రీన్ మీద చాలా క్లియర్‌గా కనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకూ గుణశేఖర్ తీసిన సినిమాలకి దీనికి ఎక్కడా సంబంధమే ఉండదు. నిజానికి తన బౌండరీ దాటొచ్చి.. ఈ తరానికి ఏదో చెప్పాలనే తపనతో ఆయన ఈ సినిమాని తీసినట్లు కనిపించింది.

చెప్పాలనుకున్న పాయింట్, ఎంచుకున్న సబ్జెక్ట్ విషయంలో ఎలాంటి మిస్టేక్ అయితే లేదు. ఫస్టాఫ్ అంతా క్రైమ్ ఎలా జరిగింది.. దోషుల్ని ఎలా పట్టుకున్నారు, సీన్ రీ కన్‌స్ట్రక్షన్, ఎవిడెన్స్ కలెక్షన్, ఇంట్రాగేషన్, కోర్టు ప్రొసీజర్స్.. ఇవన్నీ చాలా డిటైల్‌గా చూపించారు. అయితే సెకండాఫ్‌లో ఎప్పుడైతే డ్రగ్స్ ముఠా చుట్టూ కథ మళ్లుతుందో అక్కడ సినిమా స్లో అయినట్లు.. సాగదీసినట్లు అనిపిస్తుంది. స్టోరీ ఎటో వెళ్తుందే అన్నట్లుగా ఆడియన్స్ ఫీల్ అవుతారు. కానీ సెకండాఫ్‌లో కిందపడిన సినిమాని క్లైమాక్స్ మాత్రం నిలబెట్టింది.

ఆ నలుగురు
ఈ సినిమాకి భూమిక పాత్ర వెన్నెముక అని గుణశేఖర్ ప్రెస్‌మీట్‌లో చెప్పిన మాట నిజమే. ఎందుకంటే సినిమా మొత్తంలో భూమిక పోషించిన వింద్య పాత్రకి చాలా బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. కెరీర్ అంటూ పిల్లలకి సరైన సమయాన్ని కేటాయించలేని తల్లిగా, అదే పిల్లలు చేయకూడని తప్పు చేస్తే తన వల్లే ఆ తప్పు జరిగిందని కుమిలిపోయే తల్లిగా, కన్నకొడుకైనా సరే తప్పు చేసిన తనబిడ్డకి శిక్ష పడాలి.. అలానే ఒక కొత్త జీవితం కూడా ఇవ్వాలి అని తాపత్రయపడే మాతృమూర్తిగా భూమిక అద్భుతంగా నటించారు.

చాలా రోజుల తర్వాత భూమికకి ఒక సాలిడ్ క్యారెక్టర్ అయితే దక్కింది. అయితే కొడుకుని సరైన మార్గంలో పెట్టడానికి తల్లి తప్పటడుగు వేయడం అనేది మాత్రం చూసే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనేదే పాయింట్. అదొక్కటి పక్కన పెడితే వింద్య పాత్రలో భూమిక జీవించారు. ఇక ఈ సినిమాకి మరో ప్రధానమైన బలం సారా అర్జున్. బాల నటిగా ఎన్నో సినిమాల్లో క్యూట్‌గా కనిపించిన సారా రీసెంట్‌గా ధురంధర్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు యుఫోరియాతో తెలుగు ప్రేక్షుకుల్ని పలకరించింది.

ఇందులో చైత్రగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ చూపించింది సారా. మొదట్లో బాధితురాలిగా సారా కనబర్చిన నటన కన్నీళ్లు తెప్పిస్తే క్లైమాక్స్‌లో కనిపించిన తీరు విజిల్స్ వేయిస్తుంది. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన విఘ్నేష్ కూడా క్లైమాక్స్‌లో కన్నీళ్లు తెప్పించాడు. విఘ్నేష్ చేసిన వికాశ్ పాత్రలో కూడా వేరియేషన్స్ చాలానే ఉన్నాయి. లుక్ పరంగా, క్యారెక్టర్ పరంగా కూడా ఆ తేడాని బాగా కనపరిచాడు.

అలానే సిటీ కమిషనర్‌గా నటించిన గౌతమ్ మీనన్ ఫస్టాఫ్‌లో చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. కమిషనర్‌గా గౌతమ్ మీనన్ చేయడం సినిమాకి బాగా ప్లస్ అయింది. అలానే నాజర్ సహా మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు బాగానే చేశారు. ఇక సినిమాకి కాలభైరవ ఇచ్చిన మ్యూజిక్ బావుంది. పాటలు పెద్దగా ఎక్కకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో న్యాయం చేశారు. ఓవరాల్‌గా యుఫోరియాతో గుణశేఖర్ అయితే కొత్త ప్రయత్నమే చేశారు. మరి ఇది ఎంతగా ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందో చూడాలి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhumika Chawla
  • Cinema News
  • Director Gunasekhar
  • Euphoria
  • gunasekhar
  • Movie Review
  • Movie Review And Rating
  • Sara Arjun
  • Telugu Cinema News
  • tollywood

Related News

pooja hegde Rowdy Janardhan special item song

Pooja Hegde: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే

ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే, వరుస పరాజయాల తర్వాత తన రూటు మార్చింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ప్రస్తుతం ఈ ‘బుట్టబొమ్మ’ స్పెషల్ సాంగ్స్‌తో దూసుకుపోతోంది. ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా, ‘కూలీ’లో మోనికాగా మెప్పించిన పూజా, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. రవిక

    Latest News

    • TG Intermediate Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్..ఫలితాల్లో ఆ జిల్లానే టాప్

    • చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌!

    • మ‌రో తీవ్ర‌మైన వ్యాధి.. ఇప్ప‌టికే కోటి మంది ఎఫెక్ట్‌?!

    • CSKకు తొలి విజయం.. కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఫైన్‌!

    • ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇప్పుడు ఏం జ‌ర‌గ‌బోతుంది?

    Trending News

      • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

      • ముంబై ఇండియ‌న్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శ‌ర్మ‌!

      • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

      • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

      • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd