HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Surgery For Appearance

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

  • Author : Vamsi Chowdary Korata Date : 25-05-2026 - 1:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Surgery For Appearance Avika Gor
Surgery For Appearance Avika Gor

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వాస్తవమే. కానీ, అది అందం కోసం చేయించుకున్న సర్జరీ కాదు.. కేవలం నా ముఖంపై ఉన్న పింపుల్స్ (మొటిమలు) తగ్గించుకోవడానికి మాత్రమే. దురదృష్టవశాత్తూ అది కూడా సరిగా పనిచేయలేదు” అని వెల్లడించింది. నటిగా స్క్రీన్‌పై ప్రెజెంటబుల్‌గా కనిపించడం ముఖ్యం కాబట్టి, అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు పార్లర్‌కు వెళ్లి బ్లడ్ సెల్స్ క్లీనింగ్, బైఫిషియల్ లాంటి సాధారణ ఫేషియల్స్ చేయించుకునేదాన్ని తప్ప ఎలాంటి కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోలేదని స్పష్టం చేసింది.

“నాకు 7 ఏళ్ల వయసున్నప్పటి నుండే మేకప్ వేసుకోవడం అలవాటైంది. నా చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడతాను. అసలు ఒక చిన్న టాటూ వేయించుకోవాలన్నా, కనీసం హెయిర్ కట్ చేయించుకోవాలన్నా మా అమ్మ పర్మిషన్ కావాలి.. అలాంటిది అంత పెద్ద సర్జరీలు నేను ఎలా చేయించుకోగలను?” అని అవికా ఎదురు ప్రశ్నించింది.

శరీరంలో వచ్చిన మార్పులు, ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ.. “నా శరీరతత్వం ఏంటంటే.. చాలా త్వరగా బరువు పెరుగుతాను. అంతే వేగంగా బరువు తగ్గుతాను. వయసు పెరిగే కొద్దీ అమ్మాయిల శరీరంలో సహజంగానే మార్పులు వస్తాయి. కానీ, నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్న జనాలు ఆ మార్పులను గమనించి ప్లాస్టిక్ సర్జరీ అనుకుని పొరబడ్డారు” అని చెప్పింది. ఇండస్ట్రీలో సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు తమ బాడీని ఎంత పర్‌ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తారో చూసి తాను ఎంతో ఇన్‌స్పైర్ అయ్యానని, వారిలాగే తాను కూడా జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ సహజంగానే బరువు తగ్గానని అవికా గోర్ క్లారిటీ ఇచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Avika Gor
  • Cosmetic Surgery
  • plastic Surgery
  • tollywood
  • weight loss

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

    • Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..

    • Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

    • Trends : శ్రీకాళహస్తిలో ‘ట్రెండ్స్’ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం

    • Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd