HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >May 23 An Unforgettable Day Nagarjunas Special Post

Akkineni Nagarjuna: మే 23.. మర్చిపోలేని రోజు: నాగార్జున స్పెషల్ పోస్ట్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 2:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
May 23... An Unforgettable Day: Nagarjuna's Special Post
May 23... An Unforgettable Day: Nagarjuna's Special Post

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున వెండితెరపై హీరోగా అడుగుపెట్టి నేటితో (మే 23) సరిగ్గా 40 వసంతాలు పూర్తయ్యాయి. 66 ఏళ్ల వయసులోనూ నవమన్మథుడిలా మెరిసిపోతూ, వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగ్.. ఈ ప్రత్యేకమైన రోజున సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన సినీ ప్రస్థానంలో ‘మే 23’ తేదీకి ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు.

టాలీవుడ్ సీనియర్ హీరోలలో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. దివంగత లెజెండరీ నటుడు ఏఎన్నార్ వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలు చేస్తూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు. ఎప్పటికప్పుడు న్యూ టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలవబడుతున్నారు. 66 ఏళ్ల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న నాగ్, నేటితో హీరోగా 40 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.

Thank you for all the blessings and love being showered on me today🙏🙏🙏
May 23!! the date I cannot forget!!
The day which I had the honour of producing and releasing the last film MANAM of my legendary father ANR🙏 the film which I had the privilege of working both with my…

— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026

‘విక్రమ్’ సినిమాతో నాగార్జున హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ 1986 మే 23న విడుదలైంది. అంటే ఈ రోజుకి సినిమా వచ్చి నలభై ఏళ్లు పూర్తయింది. యాదృచ్ఛికంగా 2014లో అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా ‘మనం’ ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకే ‘మే 23’ తన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమని నాగ్ అన్నారు. ‘విక్రమ్’ విడుదలై నేటికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనను ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

From #Vikram to every milestone after that setting trends with bold daring steps inspiring me , filmmakers and generations . Thank you king ❤️ @iamnagarjuna

Marking #12YearsForClassicManam #ANRliveson a film that will always stay special to me and fortunate to be part of .… pic.twitter.com/Dt6Bq65BpM

— chaitanya akkineni (@chay_akkineni) May 23, 2026

ఈ రోజు నాపై కురిపిస్తున్న ఆశీర్వాదాలకు, ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. మే 23.. ఇది నేను ఎప్పటికీ మరువలేని తేదీ. నా తండ్రి లెజెండరీ ఏఎన్నార్ గారి చివరి చిత్రం ‘మనం’ నిర్మించి విడుదల చేసే అరుదైన గౌరవం నాకు దక్కిన రోజు ఇది. నా తండ్రితోనూ, నా కుమారులతోనూ కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించిన సినిమా అది. కొన్నేళ్ల క్రితం, ఇదే మే 23వ తేదీన నా మొదటి చిత్రం ‘విక్రమ్’ విడుదల చేయబడింది. మీ అందరినీ అలరించే, మీ ఆశీర్వాదాలను, ప్రేమను పొందే అదృష్టం నాకు దక్కింది. ఇన్నేళ్లుగా నా వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని ‘మే 23’లు నా జీవితంలో రావాలని కోరుకుంటున్నాను అని నాగార్జున తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

నాగార్జున హీరోగా మధుసూధనరావు దర్శకత్వంలో ‘విక్రమ్‌’ సినిమా తెరకెక్కింది. ఇందులో నాగ్ సరసన శోభన హీరోయిన్ గా నటించారు. ఇది 1983లో హిందీలో విడుదలైన ‘హీరో’ సినిమాకు తెలుగు రీమేక్‌. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్ పేరు మీదుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 1986లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అయితే నాగ్ మూస ధోరణిలో వెళ్లకుండా, ఎప్పటికప్పుడు కొత్తదనం వైపు అడుగులు వేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. స్టార్‌డమ్ పక్కనపెట్టి ఎన్నో ప్రయోగాలు చేశారు. మాస్, క్లాస్, యాక్షన్, డివోషనల్, ఫాంటసీ, రొమాంటిక్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ, ట్రాజెడీ, ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్..ఇలా ప్రతి జోనర్‌లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో నాగార్జున అని చెప్పాలి.

నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో మైలురాయి అయిన 100వ సినిమాలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ దర్శకత్వంలో ‘కింగ్‌ 100’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘లాటరీ కింగ్’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఇందులో టబు, ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నాగ్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • akkineni chaitanya
  • akkineni nagarjuna
  • Akkineni Nageswara Rao
  • emotional post
  • Telugu Cinema Industry
  • tollywood

Related News

Allu Arjun's 'Raka' – When is the release date?

RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’కి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్, హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్నంటే అంచనాలు నె

    Latest News

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd