HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >India Tops Global List Of Young Entrepreneurs

యువ పారిశ్రామికవేత్తల గ్లోబల్ జాబితాలో భారత్ అగ్రస్థానం

40 ఏళ్లలోపు వయసు కలిగి, వంద మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ‘సెంటీమిలియనీర్ల’ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

  • Author : Latha Suma Date : 22-01-2026 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India tops global list of young entrepreneurs
India tops global list of young entrepreneurs

. యూ40 సెంటీమిలియనీర్లలో భారత ప్రభావం

. బెంగళూరు ‘ఇండియాస్ యూ40 క్యాపిటల్’

. తొలితరం వ్యాపారవేత్తల పెరుగుదల, ఉపాధి సృష్టి

Indian Entrepreneurs: ప్రపంచవ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తల విషయంలో భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. 40 ఏళ్లలోపు వయసు కలిగి, వంద మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ‘సెంటీమిలియనీర్ల’ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ జాబితాలో మొత్తం 505 మంది యువ వ్యాపారవేత్తలు ఉండగా వారిలో 201 మంది భారతీయులే కావడం విశేషం. చైనా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలను భారత్ వెనక్కి నెట్టి, యువ సంపన్నుల విషయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నివేదిక ప్రకారం చైనా నుంచి 194 మంది యూకే నుంచి 110 మంది యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సంఖ్యల పరంగా మాత్రమే కాకుండా కొత్త ఆలోచనలు, సాంకేతికత ఆధారిత వ్యాపార నమూనాలతో భారత యువత ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో మారుతున్న వ్యాపార సంస్కృతి, స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

దేశంలో యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర బిందువుగా బెంగళూరు మరోసారి తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ నగరం నుంచి ఏకంగా 48 మంది యువ వ్యాపారవేత్తలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఉండటంతో ‘ఇండియాస్ యూ40 క్యాపిటల్’గా బెంగళూరు గుర్తింపు పొందింది. ఐటీ, స్టార్టప్ సంస్కృతి, గ్లోబల్ పెట్టుబడుల ఆకర్షణ ఈ నగరాన్ని యువ వ్యాపారవేత్తలకు స్వర్గధామంగా మార్చాయి. ఈ జాబితాలో చోటు పొందాలంటే 36 నుంచి 40 ఏళ్ల వయసు ఉండి తొలితరం పారిశ్రామికవేత్తలైతే కనీసం 100 మిలియన్ డాలర్ల వ్యాపార విలువ వారసత్వ వ్యాపారవేత్తలైతే కనీసం 200 మిలియన్ డాలర్ల సంపద ఉండాలి. ఈ ప్రమాణాలు భారత యువత వ్యాపార రంగంలో ఎంత వేగంగా ఎదుగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత రంగాల్లో భారత యువత చూపుతున్న ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. భారత్‌లో పెరుగుతున్న వ్యవస్థాపక స్ఫూర్తికి ఈ నివేదిక అద్దం పడుతోంది. జాబితాలో ఉన్న భారతీయ యువ పారిశ్రామికవేత్తల్లో 83 శాతం మంది తొలితరం వ్యాపారవేత్తలే కావడం గమనార్హం.

అంటే వారసత్వ వ్యాపారాల కంటే కొత్త ఆలోచనలు, వినూత్న పరిష్కారాలతో స్వయంగా వ్యాపారాలను నిర్మించుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. రంగాల వారీగా చూస్తే సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు ఐటీ సేవల రంగం నుంచి అత్యధికంగా 40 మంది యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఆ తర్వాత హెల్త్‌కేర్ రంగం నుంచి 18 మంది, రవాణా రంగం నుంచి 16 మంది, ఆర్థిక సేవల రంగం నుంచి 15 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ యువ పారిశ్రామికవేత్తల సంస్థల మొత్తం విలువ సుమారు 357 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. అంతేకాకుండా ఈ సంస్థలు దేశవ్యాప్తంగా 4.43 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎండీ అండ్ సీఈవో అపూర్వ సాహిజ్వానీ మాట్లాడుతూ..ఈ తరం యువ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే దేశ జీడీపీకి, ఉపాధి కల్పనకు కీలకంగా మారారు. వీరి విజయం రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. విద్యాసంస్థల పరంగా చూస్తే ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి 15 మంది పూర్వ విద్యార్థులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం. మహిళా ప్రాతినిధ్యంలో చైనా ముందుండగా భారత్ నుంచి 15 మంది మహిళా యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో ఉండటం భారత వ్యాపార రంగంలో లింగ సమానత్వం దిశగా సాగుతున్న ప్రగతిని సూచిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aventus Wealth Management
  • business
  • business news
  • china
  • Hurun India
  • india
  • Indian Entrepreneurs
  • UK
  • Young billionaires

Related News

India-EU Trade Deal

ఏంటీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం?

భారత్-ఈయూ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పంద ప్రకటన 27 జనవరి 2026న వెలువడనుంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీలో జరిగే భారత్-EU శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.

  • Deepinder Goyal

    జొమాటో సీఈఓ ప‌ద‌వికి రాజీనామా చేసిన గోయ‌ల్‌!

  • ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెన‌క్కి నెట్టేసిన కివీస్ బ్యాట‌ర్..

  • Chinese Researchers Develop Eye Surgery Robot

    రోబో తో కంటి సర్జరీ

  • Fresh Bus, Exponent Energy launch sleeper electric bus fleet

    స్లీపర్ ఎలక్ట్రిక్ బస్ ఫ్లీట్‌ను ప్రారంభించిన ఫ్రెష్ బస్, ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ

Latest News

  • వైజాగ్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – లోకేశ్ రిక్వెస్ట్

  • దావోస్ పర్యటన లో తెలంగాణ కు రూ.19,500 కోట్ల పెట్టుబడులు

  • AI వల్ల వైట్ కాలర్ జాబ్స్ కు ఎఫెక్ట్ – బిల్ గేట్స్ హెచ్చరిక

  • నంద్యాల లో ఘోర బస్సు ప్రమాదం

  • తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయాలు..మధుమేహానికి మేలు చేసే ఆరోగ్యకరమైన రైస్‌లు ఇవే..!

Trending News

    • 77వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు.. నేరస్తులను గుర్తించేందుకు స్మార్ట్ గ్లాసెస్?!

    • పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

    • దావోస్ సదస్సులో ప్రేమాయణం… కెమెరాకు చిక్కిన ట్రూడో, కేటీ పెర్రీల రొమాంటిక్ కపుల్

    • వాట్సాప్ వినియోగ‌దారుల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. జూమ్‌, గూగుల్ మీట్‌కు గ‌ట్టి పోటీ?!

    • మీ భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో ఈ మార్పులు గ‌మ‌నిస్తున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd