HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Enthusiasts

GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

  • Author : Vamsi Chowdary Korata Date : 05-05-2026 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold prices drop—a great opportunity for buyers.
Gold prices drop—a great opportunity for buyers.

పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. క్రితం రోజు తులం బంగారం రేటు ఏకంగా రూ.1300 వరకు తగ్గగా, ఈరోజు మరో రూ.440 మేర పడిపోయింది. అలాగే ఈరోజు వెండి ధర సైతం రూ.5000 మేర దిగివచ్చింది. ఈ క్రమంలో మే 5వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త లభించింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన బంగారం ధరలు దిగివచ్చేందుకు కారణమైనట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హార్ముజ్‌లో చిక్కుకున్న విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యాలకు చేర్చేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్రకటించారు. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం దేశీయంగానూ ధరలు దిగివచ్చేందుకు దోహదపడింది. సాధారణంగా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతుంటాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బంగారం ధరలపై విరుద్ధంగా ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా నిర్ణయాలు ప్రధానంగా ఇక్కడ ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మే 5వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు సైతం తగ్గడం ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.5000 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,65,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. క్రితం రోజు వరకు భారీగా దిగివచ్చిన పసిడి రేట్లు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. అయితే వెండి రేటు తగ్గింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 8 డాలర్లు పెరిగి 4532 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.29 శాతం మేర తగ్గి 72.81 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10 గ్రాములకు క్రితం రోజు రూ.1310 మేర తగ్గగా, ఈరోజు మరో రూ.440 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం ధర రూ.1,49,180 వద్దకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు క్రితం రోజు రూ.1200 మేర తగ్గగా, ఈరోజు మరో రూ.400 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,36,750 వద్దకు దిగివచ్చింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 22K gold rate
  • 24 Carat Gold Rate
  • 24K gold price
  • Andhra Pradesh Gold Rate
  • Daily gold price
  • Global Gold Prices
  • gold market . today gold price
  • gold sliver
  • sliver price

Related News

Gold prices drop—a great opportunity for buyers.

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

భారత్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, గత ఏడాదిగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Latest News

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd