HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Mlc Janga Krishnamurthi Clarity On Party Chnage

YSRCP : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా..!

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది అధికార పార్టీలో అసంతృప్త నేత‌లు పెరుగుతున్నారు. ఇప్పటికే ప‌లువురు ఎమ్మెల్యేలు

  • Author : Prasad Date : 23-01-2024 - 8:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysrcp
Ysrcp

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది అధికార పార్టీలో అసంతృప్త నేత‌లు పెరుగుతున్నారు. ఇప్పటికే ప‌లువురు ఎమ్మెల్యేలు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో వారంతా ఇత‌ర పార్టీల్లో చేరుతున్నారు. నాలుగు జాబితాల్లో 60 మందికి పైగా ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం మార్పులు చేసింది. వీరిలో ప‌లువురు ఎమ్మెల్యేల‌ను స్థాన చ‌ల‌నం చేయ‌గా.. ప‌లువురికి టికెట్లు నిరాక‌రించింది. ఇటు ప‌ల్నాడు జిల్లాలో బీసీ సామాజిక‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.గుర‌జాల నుంచి త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న అధిష్టానాన్ని కోరారు. అయితే ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాసు మ‌హేష్ రెడ్డికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మరోసారి టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు అధిష్టానం వైపు నుంచి వ‌స్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి అసంతృప్తిగా ఉన్నారు. పెనమ‌లూరు ఎమ్మెల్యే పార్థ‌సార‌థితో పాటు జంగా పార్టీ మారుతార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే ఆ ప్ర‌చారాన్ని ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి ఖండించారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను వైసీపీలోనే ఉన్నానని.. త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తార‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపారు. టికెట్ రాక‌పోతే బీసీ సంఘాల‌తో చ‌ర్చించి భవిష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు.పెన‌మ‌లూరు ఎమ్మెల్యే పార్థసార‌థితో పాటు తిరువూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి వెళ్తార‌నే ప్ర‌చారం సాగుతుంది. వీరితో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి కూడా టీడీపీలో చేరతార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఐదో జాబితాలో గుర‌జాల టికెట్ ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తికి రాక‌పోతే ఆయ‌న పార్టీ మారే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌న్నిహితులు చెప్తున్నారు. మ‌రో ఐదో జాబితాలో ఎవ‌రికి చోటు ద‌క్కుతుందో వేచి చూడాలి.

Also Read:  7 Killed : తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు.. రెండు ఇళ్లలో కాల్పులు.. ఏడుగురి మృతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 AP Assembly elections
  • andhra pradesh
  • ap
  • cm jagan
  • Gurajala
  • MLC Janga krishna murthi
  • ysrcp

Related News

Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రభుత్వ నియంత్రణలోని అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్‌బ్యాంక్‌తో కీలక చర్చలు జరిపారు. మాస్కోలో స్బేర్‌బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో భేటీ అయిన లోకేష్, భారత్‌లో బ్యాంకింగ్, టెక్నాలజీ, స్మార్ట్ సిటీ రంగాలలో సహకారానికి సంబంధించి పలు ముఖ్

  • Sajjala

    YSRCP : కూట‌మి ప్ర‌భుత్వంలో రెండేళ్లలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లే – స‌జ్జ‌ల

Latest News

  • చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd