YS Jagan: కోర్టుకే షెడ్యూల్ ఇచ్చిన వైఎస్ జగన్!
"కోర్టులో తాను ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటాను అనేది ఒక ముద్దాయి ఎలా నిర్ణయిస్తాడు?" అంటూ న్యాయవ్యవస్థ పట్ల ఈ వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కోర్టు ముందు అందరూ సమానమే అన్న సూత్రాన్ని గుర్తు చేస్తున్నారు.
- Author : Gopichand
Date : 19-11-2025 - 7:04 IST
Published By : Hashtagu Telugu Desk
YS Jagan: దేశ న్యాయ చరిత్రలోనే అరుదైన, విస్మయపరిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక తీవ్రమైన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏకంగా తాను కోర్టులో ఎంతసేపు ఉంటానో స్వయంగా న్యాయస్థానానికి ‘షెడ్యూల్’ సమర్పించడంపై ప్రజలు, న్యాయ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు.
‘11.30కి వచ్చి 12.30కు వెళ్ళిపోతా’
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, 13 ఏళ్లకు పైగా బెయిల్ పై ఉన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఈ సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచారు. సుదీర్ఘ కాలంగా ఒక్కసారి కూడా కోర్టు విచారణకు హాజరు కాని జగన్, ఎట్టకేలకు న్యాయస్థానం ఆదేశాల మేరకు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే ఈ హాజరు విషయంలో ఆయన అనుసరించిన వైఖరి విమర్శలకు దారి తీసింది. కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. “నేను ఉదయం 11.30 గంటలకు కోర్టుకు వస్తాను. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి వెళ్ళిపోతాను” అంటూ ఆయన కోర్టుకే ఒక గంట సమయాన్ని నిర్దేశించినట్లు సమాచారం.
Also Read: Air India: భారత్-పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. ఎయిర్ ఇండియాకు భారీ నష్టం!
జగన్ కోర్టు సమయాన్ని ఎలా నిర్ణయిస్తారు?
సాధారణంగా ఒక ముద్దాయి కోర్టు ఆదేశాలకు లోబడి, న్యాయమూర్తి విచారణ సమయానికి అనుగుణంగా హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ పూర్తయ్యే వరకు కోర్టులో ఉండే సంప్రదాయం ఉంది. కానీ ఈ కేసులో నిందితుడిగా ఉన్న జగన్ ఒక గంట పాటు మాత్రమే కోర్టులో ఉంటాను అని స్వయంగా ‘టైమ్ టేబుల్’ ఇవ్వడంపై ప్రజలు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
“కోర్టులో తాను ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటాను అనేది ఒక ముద్దాయి ఎలా నిర్ణయిస్తాడు?” అంటూ న్యాయవ్యవస్థ పట్ల ఈ వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కోర్టు ముందు అందరూ సమానమే అన్న సూత్రాన్ని గుర్తు చేస్తున్నారు. దాదాపు గంట పాటు కోర్టులో ఉంటాను అంటూ కోర్టుకే సమయం ఇచ్చిన ఈ వ్యవహారం చూసి సాధారణ జనం షాక్ అవుతున్నారు. ఈ అరుదైన సంఘటన దేశ న్యాయ చరిత్రలో చర్చనీయాంశంగా మారింది.