YS Jagan: లండన్‌లో లుక్ మార్చిన వైఎస్ జగన్!
టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ జిల్లాల పర్యటన చేయనున్నారు. జిల్లాలో పర్యటనలో స్థానిక వైసీపీ కార్యకర్తలతో కూడా జగన్ సమావేశం కానున్నట్లు సమాచారం.
- By Gopichand Published Date - 10:06 PM, Thu - 16 January 25

YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన తన రెండో కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే జగన్ తన డ్రెస్సింగ్ స్టైల్‌ను మార్చేశారు. ఎప్పుడూ ధరించే డ్రెస్ కోడ్‌తో పాటు పైన బ్లాక్ కోటు ధరించి స్టైలిష్‌గా ఉన్నారు. లండన్‌లో ఉన్న వైసీపీ, జగన్ అభిమానులు ఆయనతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే జగన్ ఈ నెలాఖరు వరకు లండన్‌లోనే ఉండనున్నట్లు సమాచారం.
Also Read: Nitish Kumar Reddy: క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల చెక్ అందించిన సీఎం
BOSS In London ❤️🔥#YSJagan pic.twitter.com/UpGkdyiVXv
— YS JAGAN ✊ (@chari518149) January 16, 2025
త్వరలోనే జిల్లాల పర్యటన?
గతేడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాల్లో, 4 ఎంపీ స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. టీడీపీ కూటమి (టీడీపీ+జనసేన+బీజేపీ) 164 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ప్రకటించిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ డిమాండ్ చేస్తుంది.
టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ జిల్లాల పర్యటన చేయనున్నారు. జిల్లాలో పర్యటనలో స్థానిక వైసీపీ కార్యకర్తలతో కూడా జగన్ సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఎజెండాతో వైఎస్ జగన్ జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించాలని జగన్ యోచించారు. అయితే అనుకోకుండా తన కూతరు వర్షారెడ్డి డిగ్రీ ప్రధానోత్సవం కార్యక్రమం ఉండటంతో లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఈ నెలఖారు వరకు జగన్ లండన్‌లోనే ఉండాల్సి రావడంతో జిల్లాల పర్యటనను వచ్చే నెల నుంచే ప్రారంభించనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.