HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Weightage For Employees Based On Performance Cm Chandrababu New Policy

వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.

  • Author : Latha Suma Date : 24-02-2026 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weightage for employees based on performance... CM Chandrababu new policy
Weightage for employees based on performance... CM Chandrababu new policy

CM Chandrababu : ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు. తాజాగా ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ నూతన విధానాన్ని ప్రకటించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల మన్ననలు పొందుతూ అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందిని గుర్తించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి నెలా ఉత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులను ఎంపిక చేసి వారికి అభినందన లేఖలు పంపాలని, ఆ ప్రశంసలను వారి సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలని సీఎం సూచించారు. ఇది వారి భవిష్యత్ పదోన్నతులు, వృత్తి అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన వారిని కూడా గుర్తించి తగిన మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

వైద్య, దేవదాయ శాఖలకు కీలక సూచనలు

వైద్యారోగ్య శాఖ పనితీరుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని స్థాయిల్లో పారిశుద్ధ్యాన్ని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించవద్దని, ఆసుపత్రుల అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు పూర్తి బాధ్యత అప్పగించాలని పేర్కొన్నారు. ఎక్కడా వైద్యుల కొరత ఉండకూడదని, అవసరమైతే వెంటనే నియామకాలు చేపట్టాలని కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దేవదాయ శాఖకు సంబంధించి దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రెవెన్యూ శాఖకు ‘ఫ్రెష్ లుక్’ .. అవినీతిపై హెచ్చరిక

రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ శాఖకు ఉన్న చెడ్డపేరు పోవాలంటే స్పష్టమైన మార్పు కనిపించాల్సిందేనని అన్నారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, సేవలను పూర్తిగా ఆటోమేషన్ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడితే ఏసీబీ చర్యలు తప్పవని హెచ్చరించారు. పనితీరు లోపించిన తహసీల్దార్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సూచించారు. అదేవిధంగా తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని, అవసరమైతే మొబైల్ ల్యాబ్‌లను అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఆడిట్ నిర్వహించి నివారణ చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు సూచించారు. టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మీ-సేవ కేంద్రాలు, డ్వాక్రా సంఘాల ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ, వైద్యారోగ్యం, దేవదాయ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనలో సానుకూల మార్పులకు ఈ కొత్త విధానం దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • CM Chandrababu Naidu
  • Employee performance
  • governance
  • government employees
  • Incentives
  • public services
  • review meeting
  • RTGS
  • technology

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

Latest News

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd