HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >We Will Improve Public Education Beyond The Private Sector Minister Lokesh

Minister Lokesh: ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్‌

గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.

  • By Gopichand Published Date - 08:25 PM, Mon - 9 June 25
  • daily-hunt
Minister Lokesh
Minister Lokesh

Minister Lokesh: ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నా, అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా, సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్ -2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన 95మంది, ఇంటర్మీడియట్ లో ప్రతిభకనబర్చిన 26మందిని మంత్రి లోకేష్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలుచేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాం. ఇది సంస్కరణల్లో తొలి అడుగు మాత్రమే. మీరు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు, మీ ప్రతిభను గుర్తించే బాధ్యత నాది. రాబోయేరోజుల్లో ప్రభుత్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి మీ పాఠశాలలకు సేవచేయాలి. మీ జూనియర్లకు గైడ్ చేయడం ద్వారా స్పూర్తినివ్వండి.

ఈరోజు మీరుసాధించిన విజయాలు భారతదేశానికి తెలియాల్సిన అవసరం ఉంది. పేదరికం నుంచి బయటపడటానికి చదువే ఏకైక మార్గం. జీవితంలో ఏం కోల్పోయినా చదువును ఎవరూ దూరంచేయలేరు. మీరంతా కష్టపడి బాగా చదివారు. హ్యాట్రిక్ సాధించిన పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అభినందనలు. మిమ్మల్ని చూసి మేము గర్వపడుతున్నాం. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు తెస్తున్నాం. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నాం. మీకు అద్భుతమైన ఫౌండేషన్ ఉంది. అవకాశాలను నిచ్చెనమెట్లుగా ఉపయోగించుకుని మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

పదోతరగతి విద్యార్థులకు ఇప్పటినుంచే అసలు పరీక్ష మొదలవుతుంది, దానిపేరే జీవితం. పరీక్ష పెట్టే భగవంతుడే జయించేశక్తి కూడా దేవుడు ఇస్తాడు. కష్టాలు అందరికీ ఉంటాయి, వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న వారే విజేతలుగా నిలుస్తారు. విద్యార్థులు ప్రశ్నించడం ద్వారా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వయసు 75సంవత్సరాలు. ఇప్పటికీ ఆయనలో ఎక్కడా వయోభారం కనపడదు. మా అందరికంటే స్పీడ్ గా పరుగెడతారు. మహానాడు 3రోజుల్లో అందరం పడిపోయాం, బాబుగారు మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేరు. ఆయన నుంచి ప్రతిఒక్కరూ క్రమశిక్షణ నేర్చుకోవాలి.

కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు కొత్తజీవితం ప్రారంభవుతుంది. ఒకసారి మీరు పక్కదారి పడితే జీవితాలు నాశనమవుతాయి. మీ తల్లిదండ్రులు మీ ప్రవర్తన ఉండాలి. యువగళం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో ఓ తల్లి ఆవేదన చూశాక డ్రగ్స్ వల్ల జీవితాల నాశనం అవుతున్నాయని గుర్తించి డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ప్రారంభించాం. డ్రగ్స్ పై మన ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. తప్పుచేస్తే మీతోపాటు తల్లిదండ్రులు ఇబ్బందిపడతారు. మంచిచెడులకు తేడా, తెలుసుకుని ముందుకువెళ్లాలి. పట్టుదల, క్రమశిక్షణ వల్ల మీరంతా ఈ స్థాయికి వచ్చారు. భారతదేశం గర్వపడేలా మీరంతా ఉన్నతస్థానాలకు చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

విద్యార్థులు జీవితంలో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. మంచి మెంటర్స్ ద్వారా స్పూర్తి పొంది, నిరంతరం నేర్చుకోండి. ముఖ్యమంత్రిగారు మాకు పూర్తిస్వేచ్చ ఇస్తారు. ఎన్నికష్టాలు వచ్చినా అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. విద్యార్థులు జీవితంలో కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అందుకు నేనే ఉదాహరణ. ఎన్నికల్లో పోటీకి టిడిపి ఎప్పుడూ గెలవని మంగళగిరిని ఎంచుకున్నా. 2019లో ఓడిపోయాను, అయినా పట్టుదలతో లక్ష్యాన్ని నిర్దేశించుకొని ధైర్యంగా ముందుకు సాగా. అయిదేళ్లు కష్టపడి రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీ సాధించా. విద్యాశాఖ వద్దని చాలామంది చెప్పారు. ఎన్నికష్టాలు వచ్చినా ఫర్వాలేదని ఈ శాఖనే ఎంచుకున్నా.

మార్పు మీ నుంచే రావాలి. మీరు డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్ పై రాసినవి చూశాను. స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు ప్రతిభ అవార్డు పొంది ఐఎఎస్ అధికారి అయి కమిషనర్ అయ్యారు. జీవితంలో మీ విజయానికి కారణమైన వారిని మరువద్దు. నా మెంటర్ రాజిరెడ్డి గారిని ఇప్పటికీ కలుస్తుంటా. మీ ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను మరువద్దు. కాలం మారినా గౌరవం తగ్గకూడదు. విద్యార్థులంతా బాధ్యతకలిగిన పౌరులుగా మెలగాలి. విద్యార్థులు జీవితంలో ఎన్ని పరీక్షలు ఎదురైనా వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు.

Also Read: Gaddar Film Awards : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక డేట్ & వేదిక ఫిక్స్

లిటరసీ రేటుపై ఇటీవల వచ్చిన రిపోర్టు చూసి ఆశ్చర్యపోయా. ఎపి దేశంలో అత్యంత దిగువన ఉంది. రాబోయే నాలుగేళ్లలో నూరుశాతం అక్షరాస్యత లక్ష్యంగా మిషన్ అక్షర ఆంధ్రను ప్రకటించాం. మంచివిధానాలతో విద్యారంగాన్ని ముందుకు తీసుకెళతాం. భారత్ శాంతియుత దేశం. పెహల్గావ్ మారణాకాండకు సమాధానంగా ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రధాని ముష్కరులకు సరైన గుణపాఠం చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లో మురళీనాయక్ ను కోల్పోయాం. ఆయన తల్లిదండ్రులకు ఒకేఒక బిడ్డ. ఏదైనా జరిగితే భారత్ నా వెనుక నిలుస్తుందని చెప్పిన ధీరోదాత్తుడు మురళీనాయక్. అటువంటి జవాన్లు బార్డర్ లో మనకోసం నిలబడుతున్నారు వారికి అండగా మనం నిలబడాలి. ప్రధాని ఏ పిలుపునిచ్చినా దేశభక్తిని చాటాలి, ఇప్పటివరకు 25ఉగ్రదాడులు జరగ్గా, తొలిసారి మోడీజీ నేతృత్వంలో సరైన గుణపాఠం చెప్పాం, వందే మాతరం అంటూ లోకేష్ విద్యార్థులతో కలసి నినదించారు.

ఈ సందర్భంగా డ్రీమ్ వాల్, యాంబిషన్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్ పై విద్యార్థినీ, విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్తీకరించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి దేశానికి సేవచేస్తానని భీమిని ఎపి మోడల్ స్కూలు విద్యార్థిని జి.జితు, ఐఎఎస్ అధికారిని అవుతానని జి.జగదీష్, టీచర్ నై ఉత్తమ పౌరులను తయారుచేస్తానని భీమిని కెజిబివి జూనియర్ కాలేజి విద్యార్థిని సిహెచ్ ప్రియాంక, ఇంజనీరింగ్ చదివి దేశాభివృద్ధిలో కీలకమైన రోడ్లు వేస్తానని బోదెల జ్యోత్స్న తమ జీవిత లక్ష్యాలను వాల్ పై రాశారు. డాక్టర్ అయి పేదలకు సేవచేస్తానని నిడగల్లు జడ్ పిహెచ్ ఎస్ స్కూలుకు చెందిన ఆర్.ప్రజ్ఞ, ఎఐ ఇంజనీర్ అవుతానని పాలకొండ తమ్మినాయుడు స్కూలుకు చెందిన వావిళ్లపల్లి గాయత్రి, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదివి చాట్ జిపిటి వంటి నవీన ఆవిష్కరణలు చేస్తానని పాలకొండ సత్యసాయి జూనియర్ కళాశాలకు చెందిన కొమరపు గుణశ్రీ తెలియజేశారు.

గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. తాను పిహెచ్ డి చేసి పేరెంట్స్ ను బాగా చూసుకుంటానని కోటిపాం జడ్ పిహెచ్ ఎస్ కు చెందిన కె.లోకేష్ తెలుపగా, పాలకొండకు చెందిన ప్రహర్షిణి మంత్రి లోకేష్, కళాశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపగా, తమపై ప్రత్యేకశ్రద్ధ వహించి, ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, లోకేష్ లకు రుణపడి ఉంటానని పాలకొండ సత్యసాయి కాలేజికి చెందిన కొమరపు గుణశ్రీ గ్రాటిట్యూడ్ వాల్ పై రాశారు. వాల్స్ పై విద్యార్థులు రాసిన మనోభావాలను ఆసక్తిగా చదివిన లోకేష్… విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాలను చేరుకోవాలని, అందుకు తమవంతు సహకారం అందిస్తామని అన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • CM Chandrababu
  • Minister Lokesh
  • State News

Related News

CM Chandrababu

Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • CM Chandrababu Naidu

    CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!

  • Minister Nara Lokesh

    Minister Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో నెరవేరిన చిన్నారి జెస్సీ కల!

  • CM Chandrababu Naidu

    Agriculture : ఎమ్మెల్యేలు పొలాలకు వెళ్లండి.. చంద్రబాబు సూచన

Latest News

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

  • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

  • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

  • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

Trending News

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd