Srivari Darshanam: స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం: టీటీడీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
- By Gopichand Published Date - 11:53 AM, Sat - 30 November 24

Srivari Darshanam: స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం (Srivari Darshanam) కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. డిసెంబర్ 1న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియంలో తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. టీటీడీ ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లును టీటీడీ జారీ చేయనుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి , రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న 62,147 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 23,096 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపంలో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
Also Read: Burra Venkatesham: టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం
తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం
తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది. ఇటీవలే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నిషేధాన్ని నేటి నుంచి అమలు చేయనుంది. రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.