HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sonusood Ambulances For Ap Govt

Ambulances : ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్‌ అంబులెన్స్‌లు..

తనను కలిసేందుకు వచ్చిన సోనూసూద్‌‌ను యోగక్షేమాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని... ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Author : Latha Suma Date : 03-02-2025 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sonusood Ambulances for AP Govt.
Sonusood Ambulances for AP Govt.

Ambulances : నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూ సూద్‌ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు. అంబులెన్స్‌లకు సంబంధించిన తాళాలను సీఎం చేతికి అందజేశారు. అనంతరం ఈ అంబులెన్సులను చంద్రబాబు ప్రారంభించారు. తనను కలిసేందుకు వచ్చిన సోనూసూద్‌‌ను యోగక్షేమాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నటుడు సోనూ సూద్ కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సోనూసూద్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటారన్న సోనూసూద్.. ఏపీ తనకు రెండో ఇళ్లు లాంటిదన్నారు. తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళేనని గుర్తు చేశారు. ఏపీ ప్రజలు తనను ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంచుతారన్న సోనూసూద్.. ఏ అవసరం వచ్చినా ఫోన్ కాల్ దూరంలో ఉంటానన్నారు. ఏపీలో వైద్య సౌకర్యాలను అభివృద్ధి చేయటంలో తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని అంబులెన్సులు అందించినట్లు తెలిపారు.

ఏపీని అభివృద్ధి చేయటంలో తన భాగస్వామ్యం కూడా ఉండాలని అంబులెన్సులను ఇచ్చానన్నారు. సూద్ ఫౌండేషన్ ప్రతీ సామాన్య వ్యక్తి కోసం పని చేస్తోందని, అవసరమైతే ప్రభుత్వాలతోనూ కలిసి పని చేస్తామన్నారు. అంబులెన్సులు ఎంత అన్నది ముఖ్యం కాదని ప్రజలతో ఉన్న అనుబంధం ముఖ్యమని తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనే తనను ఇలా నడిపిస్తోందని తెలిపారు. కోవిడ్ సమయం నుంచి సీఎం చంద్రబాబుతో తాను టచ్​లో ఉన్నానని, వారి ఆశీర్వాదం కూడా ఇప్పుడు తీసుకున్నానన్నారు.

Read Also: SwaRail vs IRCTC : ‘స్వరైల్’, ‘ఐఆర్‌సీటీసీ’ యాప్‌లలో ఏది బెటర్ ?

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Sonu Sood
  • Ambulances
  • ap
  • CM Chandrababu
  • Sood Charity Foundation

Related News

Jada Sravan

Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

ప్రజా సమస్యలపై గళం విప్పుతానని చెప్పుకునే న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి

  • Iftar Ramadan

    Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Unified Family Survey

    Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

Latest News

  • సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

  • తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

  • అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

  • Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!

  • చంద్రబాబు మార్క్ పాలన.. మంత్రులకు సీఎం రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd