SwaRail vs IRCTC : ‘స్వరైల్’, ‘ఐఆర్‌సీటీసీ’ యాప్‌లలో ఏది బెటర్ ?
స్వరైల్ యాప్ ద్వారా మనం రైల్వే టికెట్లను(SwaRail vs IRCTC) బుక్ చేసుకోవచ్చు.
- By Pasha Published Date - 06:32 PM, Mon - 3 February 25

SwaRail vs IRCTC : ‘స్వరైల్’ (SwaRail) మొబైల్ యాప్ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ యాప్‌ను ఇటీవలే రైల్వే శాఖ ప్రారంభించింది. దీన్ని మనం కూడా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్‌ను తొలి విడతగా 1000 మంది మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ వెయ్యి మంది నుంచి సేకరించే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ‘స్వరైల్’ యాప్‌ను మరింతగా తీర్చిదిద్దుతారు. అదనపు ఫీచర్లను జోడిస్తారు. తదుపరి విడతలో స్వరైల్ యాప్‌ను మరో 10వేల మంది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
Also Read :Fact Check: స్టార్ క్రికెటర్ సిరాజ్‌కు విగ్రహాలు.. ఫొటోలు వైరల్
‘స్వరైల్’ యాప్‌లోని ఫీచర్లు
- స్వరైల్ యాప్ ద్వారా మనం రైల్వే టికెట్లను(SwaRail vs IRCTC) బుక్ చేసుకోవచ్చు.
- రిజర్వ్, అన్‌రిజర్వ్ రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఈ యాప్‌ను వాడుకోవచ్చు.
- రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్లు, పార్సిల్ బుకింగ్‌లను స్వరైల్ ద్వారా చేసుకోవచ్చు.
- రైల్వే ఎంక్వైరీలు, పీఎన్‌ఆర్ తనిఖీలు, రైల్ మదద్ ద్వారా అందించే సేవలు కూడా స్వరైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
- ‘స్వరైల్’ ద్వారా వివిధ రకాల రైల్వే సేవలను పొందే క్రమంలో సైన్ ఇన్ కావడానికి ఒకే సైన్ ఇన్ సరిపోతుంది.వేర్వేరు సైన్ ఇన్‌లు అవసరం లేదు. ఇవే క్రెడెన్షియల్స్‌తో IRCTC Rail Connect, UTS మొబైల్ యాప్‌లలోకి కూడా లాగిన్ కావొచ్చు.
Also Read :Manipur CM : ‘‘సీఎం వల్లే హింసాకాండ ?’’.. ఆడియో క్లిప్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఐఆర్‌సీటీసీకి, స్వరైల్‌కు తేడా ఏమిటి ?
- ‘ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్’ (IRCTC Rail Connect) యాప్ ద్వారా మనం రైల్వే రిజర్వుడ్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోగలం.
- స్వరైల్ యాప్ ద్వారా మనం రిజర్వుడ్ టికెట్లతో పాటు అన్ రిజర్వుడ్ టికెట్లను కొనొచ్చు. ప్లాట్‌ఫామ్ టికెట్లను సైతం పొందొచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులతో ఆయా టికెట్ల పేమెంట్స్ చేయొచ్చు.
- ఐఆర్‌సీటీసీ, స్వరైల్.. రెండు యాప్‌లలో కూడా మనం పీఎన్‌ఆర్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. అయితే మనం చెక్ చేస్తున్న రూట్లలో నడిచే ఇతర ట్రైన్ల వివరాలను కూడా స్వరైల్ యాప్‌లో చూపిస్తారు.
- రీఫండ్ ట్రాకింగ్ రెండు యాప్‌లలో కూడా అందుబాటులో ఉంది.
- వివిధ రకాల రైల్వే సర్వీసుల కోసం ఐఆర్‌సీటీసీ యాప్‌లో వేర్వేరు లాగిన్‌లు కావాలి. స్వరైల్ యాప్‌లో ఒకే సైన్ ఇన్‌తో అన్ని రకాల రైల్వే సేవలను పొందొచ్చు.
- స్వరైల్ యాప్ నుంచి రైళ్లలో ఫుడ్ ఆర్డర్స్ ఇవ్వొచ్చు. పార్సిల్ సర్వీసులను ట్రాక్ చేయొచ్చు.
- ఐఆర్‌సీటీసీ యాప్ కంటే స్వరైల్ యాప్ చాలా చిన్నది. అందువల్ల మీ ఫోనులో ఈజీగా స్టోర్ అవుతుంది. దానివల్ల ఫోన్‌పై పెద్దగా భారం పడదు.