Janasena Varahi Yatra : వారాహి మూడో విడత యాత్ర.. జగదాంబ జంక్షన్లో భారీ సభ.. వైజాగ్‌పై పవన్ స్పెషల్ ఫోకస్..
రేపటి నుంచి అనగా ఆగస్టు 10 నుంచి విశాఖలో పవన్ వారాహి యాత్ర (Janasena) మొదలవ్వనుంది. గురువారం నుంచి ఈ నెల 19 వరకు యాత్ర జరుగుతుంది.
- Author : News Desk
Date : 09-08-2023 - 10:17 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారాహి యాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న తరుణంలో పవన్ కూడా స్పీడ్ పెంచి జనాల్లో ఉండటానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన వారాహి యాత్ర (Janasena Varahi Yatra) రెండు విడతలు గోదావరి జిల్లాల్లో చేసి హైప్ తెచ్చుకున్నారు. ఈ యాత్రతో చాలా రోజులు పవన్ వార్తల్లో నిలిచారు. ఇక పవన్ స్పీచ్ లో రోజు వైరల్ అవ్వడం, దానికి వైసీపీ నాయకులు కౌంటర్లు ఇచ్చి మరింత వైరల్ చేయడంతో వారాహి యాత్ర జనసేనకు బూస్ట్ ఇచ్చింది.
దీంతో ఇప్పుడు మూడో విడత మరింత జోష్ తో చేయాలని, జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ఫిక్స్ అయ్యారు. విశాఖ జిల్లాలో జనసేన వారాహి యాత్ర మూడో విడత జరగనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. గతంలో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలాగే వైసీపీ నాయకులు వైజాగ్ (Vizag) ని రాజధాని అనడం, రుషికొండని తవ్వేయడం.. ఇలా అనేక అంశాలు ఉండటంతో ఈ సారి పవన్ వైజాగ్ పై మరింత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
రేపటి నుంచి అనగా ఆగస్టు 10 నుంచి విశాఖలో పవన్ వారాహి యాత్ర మొదలవ్వనుంది. గురువారం నుంచి ఈ నెల 19 వరకు యాత్ర జరుగుతుంది. యాత్ర కోసం నేడు సాయంత్రానికి నగరానికి పవన్ చేరుకోనున్నారు. రేపు సాయంత్రం జగదాంబ జంక్షన్లో భారీ సభ నిర్వహించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. గత రెండు విడతల యాత్రను మించి మూడో విడత యాత్రను సక్సెస్ చేయాలని జనసేన భావిస్తోంది. ఇప్పటికే యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. మరి వైజాగ్ వారాహి యాత్ర జనసేనకు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
Also Read : Minister Amarnath : చంద్రబాబుపై రౌడీషీట్ తెరవాలి – మంత్రి అమర్‌నాథ్