HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Could Not Say That He Is The Reason For This Situation

YS Jagan : ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు..

YS Jagan : ఉపాధి, ఉద్యోగ కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యారనే చర్చ జరిగింది. వీటన్నింటిని మర్చిపోయి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో.. కూటమి నేతలు జగన్‌కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు.

  • By Latha Suma Published Date - 02:28 PM, Sat - 19 October 24
  • daily-hunt
Jagan Strong Warning
Jagan Strong Warning

YS Jagan: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో.. రాష్ట్ర ప్రభుత్వంలో దోపిడి రాజ్యమేలుతోందంటూ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓసారి తన పాలనను గుర్తుచేసుకున్నారేమోనని కొందరు.. ప్రజల దృష్టి మరల్చేందుకు అసత్య ప్రచారానికి తెరలేపారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇప్పటివరకు ప్రవేశపెట్టలేకపోయిందని జగన్ చెప్పారు. అదే సమయంలో ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు. ఓ రాష్ట్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే.. ఆర్థిక వనరులు ఉండాలి. అప్పులపై రాష్ట్రాన్ని నడిపిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న జగన్.. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఖజనాను పూర్తిగా ఖాళీ చేయడంతో పాటు.. ఆదాయ వనరులను పెంచేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదనేది బహిరంగ రహస్యం. చెప్పుకోదగ్గ పరిశ్రమలను తీసుకురావడంలో జగన్ ఫెయిల్ అయ్యారనే ప్రచారం జరిగింది.

ఉపాధి, ఉద్యోగ కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యారనే చర్చ జరిగింది. వీటన్నింటిని మర్చిపోయి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో.. కూటమి నేతలు జగన్‌కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు సర్వనాశనం చేసి వదిలేయడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని, ప్రస్తుతంత రాష్ట్రంలో ఆర్థిక వనరులను, ఆదాయ మార్గాలను పెంచే పనిలో ప్రభుత్వం ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలా అంకెల గారడీతో ప్రజలను మోసం చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కూటమి నేతలు చెబుతున్నారు. ఓ రకంగా జగన్ గత అసమర్థ పాలన కారణంగానే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తర్వాత కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయిందనే చర్చ జరుగుతోంది.

మరోవైపు జగన్ పైనా లోకేశ్ ధ్వజమెత్తారు. “జగన్ చేసిన లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయితే లిక్కర్ స్కాంలో ఉన్న అందరిపైనా చర్యలు ఉంటాయి. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే వారిపై చర్యలు ఉంటాయి… జగన్ ఎందుకు కంగారు పడుతున్నాడు?” అని ప్రశ్నించారు. ఇక, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గతంలో టీడీపీ తరపున వాదించిన అడ్వొకేట్లపై కూడా దాడులు చేశారు, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 2019లో బ్లూ మీడియా సాక్షి విశాఖ ఎడిషన్ లో నాపై ఫేక్ న్యూస్ పబ్లిష్ చేసింది. దానిపై నేను 75కోట్లకు పరువునష్టం దావా వేశాను. వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ వాహనం గానీ, వసతి వినియోగించలేదు. ఫ్లయిట్ టిక్కెట్లు కూడా నేనే కొనుక్కుంటున్నాను. ప్రజాజీవితంలో మేం బాధ్యతగా మెలిగే వాళ్లం. మూడోసారి విశాఖకు వచ్చాను. నేను పాదయాత్రలో వాడిన బస్సులోనే విశాఖ పార్టీ కార్యాలయంలో బసచేస్తున్నా.. అన్నారు.

Read Also: Revanth Vs KTR : రేవంత్ సవాల్ ను స్వీకరించిన కేటీఆర్..!!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • CM Chandrababu
  • Minister Lokesh
  • tdp
  • ys jagan
  • ysrcp

Related News

CM Chandrababu

CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!

సీఎం చంద్రబాబు షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ, ADNOC వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

  • YS Jagan

    YS Jagan: బాల‌కృష్ణ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో ఇదే!

  • High Speed Train Ap

    High Speed Trains : ఏపీలో హైస్పీడ్ రైళ్లు రయ్… రయ్…

  • Minister Lokesh

    Minister Lokesh: ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకారం అందించండి: మంత్రి లోకేష్‌

  • CM Chandrababu

    WhatsApp Services : 9 వాట్సాప్ సేవలను ప్రారంభించిన చంద్రబాబు

Latest News

  • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

  • Donald Trump: కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు.. సాక్ష్యంగా ట్రంప్!

  • Rohit Sharma: రోహిత్ శర్మ సంచ‌ల‌న పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!

  • Congress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తప్పుడు ప్రచారాలపై కాంగ్రెస్ అప్రమత్తత!

  • Walk In Pollution: వాకింగ్‌కి సరైన సమయం ఏది? ఉదయం పూట నడక సురక్షితమేనా?

Trending News

    • Gold Prices: రికార్డు ధర నుంచి రూ. 9,000 తగ్గిన బంగారం ధర!

    • Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?

    • Rohit Sharma- Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడ‌నున్న విరాట్‌, రోహిత్‌?!

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కోహ్లీ.. ఆ విష‌యంలో స‌చిన్ రికార్డు బ్రేక్‌!

    • Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. వీడియో వైర‌ల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd