HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Group Of Men Attacked Tribe Youth And Urinate In His Mouth

Urinate: ఒంగోలులో మధ్యప్రదేశ్ తరహా దారుణం.. చావబాది, నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు

మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై జరిగిన మూత్ర విసర్జన (Urinate) ఘటన మరువక ముందే ఏపీలోనూ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

  • By Gopichand Published Date - 11:42 AM, Wed - 19 July 23
  • daily-hunt
Indian Student Dies In US
Crime Imresizer

Urinate: మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై జరిగిన మూత్ర విసర్జన (Urinate) ఘటన మరువక ముందే ఏపీలోనూ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒంగోలులో గిరిజన యువకుడిపై పలువురు దుండగులు దాడి చేసి, నోట్లో మూత్ర విసర్జన (Urinate) చేశారు. ఈ పైశాచికత్వాన్ని కొందరు వీడియో తీసి శునకానందం పొందారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ కాగా.. వీడియో ఆధారంగా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఒంగోలులో నెలరోజుల క్రితం జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తిని చావబాది, నోట్లో మూత్రం పోశారు. తీవ్ర గాయాలతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. అయితే యువకుడ్ని చితకబాది నోట్లో మూత్రం పోసిన వీడియోలు బహిర్గతమయ్యాయి. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Also Read: PUBG Love Case: పబ్జీ కేసులో బిగ్ ట్విస్ట్, ఆమె పాక్ ఏజెంట్?

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు నవీన్‌, అంజిల మధ్య చిన్నపాటి గొడవ మనస్పర్దలకు దారి తీసింది. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఒంగోలు శివారులో వీరిద్దరితో పాటు మరికొంతమంది యువకులు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న అంజి తనతో గతంలో గొడవపెట్టుకున్న నవీన్‌పై గొడవకు దిగాడు. అతనికి మిగతా యువకులు సహకరించారు. నవీన్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. బాధితుడిపై మూత్రం పోశారు. నోట్లో మూత్రం పోసి, తాగాలంటూ చావగొట్టారు. అంతే కాకుండా ఈ దారుణాన్ని తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్లో రికార్డు చేశారు.

ఈ ఘటన జరిగిన తరువాత బాధితుడు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నెల రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను నిందితుల్లోనే కొంతమంది సోషల్‌ మీడియాలో తాజాగా అప్‌లోడ్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసులో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP crime
  • crime news
  • ongole
  • Urinate

Related News

Nara Lokesh

Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!

విలువల విద్యా సదస్సులో విద్యాశాఖ మంత్రివర్యులు ప్రసంగిస్తూ సమాజంలో మార్పు తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక విలువల విద్యపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

  • Sand Supply

    Sand Supply : ఆంధ్ర నుంచి తెలంగాణ కు యథేచ్ఛగా ఇసుక

Latest News

  • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

  • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

  • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

  • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

Trending News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd