HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Five Star Hotel In Ap At A Cost Of Rs 82 49 Crore

Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

  • Author : Vamsi Chowdary Korata Date : 17-04-2026 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Radisson Blu 5-star property set to enter the City of Bulls Ongole
Radisson Blu 5-star property set to enter the City of Bulls Ongole

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. నూతన పర్యాటక విధానంలో భాగంగా హోటల్స్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి మరో సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించగా.. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ హోటల్‌ను రూ.82.49 కోట్లతో ఒంగోలుకు సమీపంలోని చదలవాడలో నిర్మించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో ఉంది. పరిశ్రమలతో పాటుగా పర్యాటకశాఖ ద్వారా కూడా ఆతిథ్య రంగంలో కొత్త హోటల్స్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో ఆతిథ్య రంగానికి చెందిన సంస్థలు హోటళ్ల నిర్మాణానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి.. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అమరావతి, విశాఖ, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలు, తిరుపతిలో కొత్త హోటళ్లు ఏర్పాటు చేయనున్నారు. నూతన పర్యాటక విధానంలో భాగంగా ఈ హోటల్స్‌కు అవసరమైన రాయితీలు కూడా అందిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో మరో కొత్త హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ప్రకాశంజిల్లా ఒంగోలు నగరానికి సమీపంలోని చదలవాడ గ్రామంలో రవిప్రియ హాస్పిటాలిటీస్‌ సంస్థ హోటల్ నిర్మించనుంది. మొత్తం రూ.82.49 కోట్ల పెట్టుబడులతో, 123 గదులతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ప్లాన్ చేశారు.. ఈ హోటల్ ద్వారా 120మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన పర్యాటక విధానం 2024-29 ప్రకారం పలు రాయితీలు అందిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హోటల్ నిర్మాణానికి సంబంధించి రవిప్రియ సంస్థ ప్రతిపాదనల్ని ఈ ఏడాది మార్చి 28న నిర్వహించిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించారు. హోటల్‌ నిర్మాణానికి సంబంధించి అవసరమైన పలు ప్రోత్సాహకాలు అందించాలని పర్యాటక శాఖకు సిఫార్సు చేశారు. ఈ మేరకు మూలనిధి పెట్టుబడి, స్టాంప్‌ డ్యూటీ, విద్యుత్‌ ఛార్జీలు వంటి వాటిలో ప్రభుత్వం తరఫు నుంచి ప్రోత్సాహకాలు అందించనున్నారు.

ఒంగోలుకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని చదలవాడ గ్రామంలో ఈ ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనున్నారు. జాతీయ రహదారి-216లో ఒంగోలు నుంచి చీరాలకు వెళ్లే మార్గంలో ఇది ఉంటుంది. నేషనల్ హైవే 216 తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు వరకు ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల మీదుగా సముద్ర తీరం వెంబడి 456 కిలోమీటర్లు ఇది ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • ap tourism
  • AP Tourism Development
  • Chadalavada
  • five star hotel
  • ongole
  • Ravi Priya Hospitalities

Related News

government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్

  • Chandrababu Naidu is serious about Sai Krishna's missing case.

    Vijayawada: సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్రబాబు సీరియస్

  • Good news from the government for those waiting for pensions.

    Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • The date has been fixed for the 'Thalliki Vandanam' amount to be credited to your account.

    Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd