HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cii Conference In Visakhapatnam

CII Summit 2025 Visakhapatnam : విశాఖపట్నంలో సీఐఐ సదస్సు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 13-11-2025 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cii Summit 2025 Visakhapatn
Cii Summit 2025 Visakhapatn

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు విశాఖలో అట్టహాసంగా శుక్రవారం నవంబర్ 14 ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమిట్‌కు ఉపరాష్ట్రపతి హాజరవుతారని తెలుస్తోంది. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా చర్చలు, సమావేశాల్లో పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. శుక్రవారం (నవంబర్ 14) నుంచి శనివారం (నవంబర్ 15) వరకు రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్నారు.

సీఐఐ సదస్సు నేపథ్యంలో విశాఖ సాగరతీరం ముస్తాబు అయింది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనాలు ఉన్నాయి. గవర్నర్‌తో పాటు ఉప రాష్ట్రపతి కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సదస్సులో భాగంగా భాగంగా మూడు రోజుల పాటు చర్చలు, సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరిక లేకుండా పనిచేయనున్నారు. సీసీఐతో కలిసి ఏపీ నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు షెడ్యూల్ ఇదే.

విశాఖలోని హోటల్ నోవోటెల్‌లో ఉదయం.. ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్-ఇండియా- యూరప్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్’ అనే అంశంపై బిజినెస్ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్, తైవాన్.. ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం పవన్, రెన్యూఎస్పీపీ పంప్స్‌ లిమిటెడ్, మురుగప్ప గ్రూప్, బాలాజీ యాక్టన్‌ బిల్డ్‌వెల్, హీరో ఫ్యూచర్‌ కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతారు. ఇక సాయంత్రం విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. సీఐఐ మండలి ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు.

సీఐఐ సదస్సు ప్రారంభం తర్వాత.. ‘టెక్నాలజీ, ట్రస్ట్‌ అండ్‌ ట్రేడ్‌’ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం తర్వాత ‘ఏఐ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసం ఇస్తారు. ఆ తర్వాత సింగపూర్‌ నుంచి విజయవాడకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు నడిపేలా ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక సాయంత్రం ఏపీలో ఆర్థికశాఖ నిర్వహించే ‘రీ ఇమేజినింగ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ సమిట్‌’లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌తో సమావేశంలో.. వివిధ అంశాలపై చర్చిస్తారు. అనంతరం వైజాగ్‌లో లూలూ గ్రూప్ నిర్మించే మాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

రెండో రోజు ఉదయం బ్లూమ్‌బర్గ్‌ మీడియా సమావేశం జరిగుతుంది. అందులో సీఎం పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడతారు. ఆ తర్వాత రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్‌ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత జపాన్, కెనడా, న్యూజిలాండ్, బహ్రెయిన్, ప్రతినిధులతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నిర్వహించే.. ‘సెంటర్‌ ఫర్‌ ఫ్రాంటియర్‌ టెక్నాలజీస్‌’ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్‌ ప్రకటించిన డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. మూడో రోజు సాయంత్రం అవగాహన ఒప్పందాల ప్రోగ్రాం ఉంటుంది. సీఐఐ సదస్సు చివరగా నిర్వహించే మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని.. ఈ సమిట్‌లో చేసుకున్న ఒప్పందాల వివరాలను వెల్లడిస్తారు.

సీఐఐ సదస్సులో అమరావతికి భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూ. 44,600 కోట్ల పెట్టుబడులకు ఈ సదస్సులో అవగాహన ఒప్పందాలు కుదరనున్నట్లు సమాచారం. టూరిజం, హెల్త్, మీడియా సిటీ, క్రీడలు, నాలెడ్జ్ సిటీ, రివర్ ఫ్రండ్ వంటి ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం 33 ఒప్పందాలు కుదరనున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu
  • CII Summit 2025
  • nara lokesh
  • Visakhapatnam

Related News

AP government takes another key decision

CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

జులై 11న జరగబోయే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే ఈ రోజున, ఏపీ ప్రభుత్వం భిన్నంగా ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన మ

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd