HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chief Minister Chandrababu Reviews Railway Projects In Andhra Pradesh State

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

  • Author : Vamsi Chowdary Korata Date : 28-01-2026 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu
CM Nara Chandrababu Naidu  ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని హింటర్ ల్యాండ్‌కు సరుకు రవాణాను పెంచేందుకు అవసరమైన రైలు అనుసంధానంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే, రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరిచే అంశాలపైనా సమీక్షించారు.

విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట వంటి ప్రధాన జంక్షన్లలో రైళ్ల రద్దీని తగ్గించే మార్గాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్-కొవ్వూరు వంటి కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు. గిరిజన ప్రాంతాలకు రైలు సౌకర్యాన్ని విస్తరించడంపై ప్రత్యేకంగా చర్చించారు.

హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు మార్గాలను హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రైల్వే నెట్‌వర్క్ విస్తరణ కీలకమని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhara cm chandrababu
  • Andhrapradesh
  • AP CM Chandrababu
  • AP CM Chandrababu Key Decision
  • chandrababu
  • CM Nara Chandrababu Naidu
  • East Coast Railway
  • New Railway Projects
  • Railway Connectivity
  • railway projects
  • Rayalaseema
  • South Central Railway
  • South Central Railways
  • vijayawada
  • Visakhapatnam

Related News

AP government takes another key decision

CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

జులై 11న జరగబోయే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే ఈ రోజున, ఏపీ ప్రభుత్వం భిన్నంగా ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన మ

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd