Owaisi VS Pawan : మీరు తల్వారులు పట్టుకొస్తే.. మేం చేతులు కట్టుకుని కూర్చొంటామా – పవన్
Owaisi VS Pawan : మీరు తల్వారులు పట్టుకొస్తే.. మేం చేతులు కట్టుకుని కూర్చొంటామా అంటూ ప్రశ్నించారు. ఓసారి మత ప్రాతిపాదికన ఈ దేశం విడిపోయిందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. మేం చేతకాని వాళ్లం కాదు అని హెచ్చరించారు
- By Sudheer Published Date - 03:20 PM, Sat - 16 November 24

జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కి వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు డేగ్లూర్ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. 15 నిముషాలు పోలీసు పక్కకు తప్పుకుంటే హిందువుల అంతు చూస్తామంటూ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ఎవడో.. హైదరాబాద్ నుంచి వచ్చి 15 నిముషాలు చాలు అనే వాళ్లకు బలమైన సమాధానం చెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఇది ఛత్రపతి శివాజీ నేల అని.. అలాంటి బెదిరింపులకు భయపడమంటూ హెచ్చరించారు.
మీరు తల్వారులు పట్టుకొస్తే.. మేం చేతులు కట్టుకుని కూర్చొంటామా అంటూ ప్రశ్నించారు. ఓసారి మత ప్రాతిపాదికన ఈ దేశం విడిపోయిందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. మేం చేతకాని వాళ్లం కాదు అని హెచ్చరించారు. సాధ్యమైనంత శాంతంగా ఉంటాం, బరిస్తాం, కానీ.. హద్దులు దాటితే మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం అంటూ ప్రశ్నించారు.
అంతకు ముందు పవన్ మాట్లాడుతూ..శివాజీ మహారాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని , సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన ఆవిర్భవించాయని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత.. జమ్ము కాశ్మీర్ లో శాంతి కనిపిస్తుందని, అద్భుత అయోధ్య నిర్మాణం సాధ్యమైందని, నలువైపుల నూతన రోడ్లు నిర్మాణమవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు.
అలాగే బీజేపీ హాయలోనే దేశంలోని రైతులు, పారిశ్రామిక వేత్తలకు అందుతున్న ప్రయోజనాల్ని పేర్కొన్నారు. సనాతన ధర్మం కోసం నిజ జీవితంలో పోరాడడం అనేది సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను చేయడంలా తేలికగా ఉండదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర దేవాలయాలు, సంస్కృతి, భాష భద్రంగా ఉండటానికి శివాజీ చేసిన కృషిని పవన్ గుర్తుచేశారు. శివాజీ నేలపై బెదిరింపులకు తాము భయపడమని స్పష్టంగా హెచ్చరించారు. మహాయుతి కూటమికి వ్యతిరేకంగా అఘాడీ కూటమిలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also : Edible Oils : ‘మలేషియా’ ఎఫెక్ట్.. వంట నూనెల ధరల మంట