AP Budget: ఏపీ బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా!
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు.
- By Gopichand Published Date - 10:58 AM, Mon - 11 November 24

AP Budget: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ (AP Budget) ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు ఆయన చెప్పారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు అని తెలిపారు. ద్రవ్యలోటు 68,743 కోట్లు అని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు.
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి 93 శాతం మంది ప్రజలు మద్దతు పలికారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవంతో సీఎం చంద్రబాబు ఏపీలో అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీ లో ముఖ్యమంత్రి ఛాంబర్ లో కేబినెట్ భేటీ #assembly #budget #apcabinet #CBN #apassembly #TDP #ChandrababuNaidu #AndhraPradesh #TeluguNews #HashtagU pic.twitter.com/Iqj8Fz0UVW
— Hashtag U (@HashtaguIn) November 11, 2024
వార్షిక బడ్జెట్ స్వరూపం
- బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
- మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు
- ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు
- జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
- జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు అంచనా 2.12 శాతం
ఏపీ బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు ఇలా
- ఆరోగ్య రంగం- రూ.18,421 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి- రూ.16,739 కోట్లు
- పట్టణాభివృద్ధి- రూ.11,490 కోట్లు
- జలవనరులు- రూ.16,490 కోట్లు
- రోడ్లు, భవనాలు రూ.9,554 కోట్లు
- ఇంధన రంగం రూ.8,207 కోట్లు
- పోలీసు శాఖ రూ.8,495 కోట్లు
- ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
- యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.322 కోట్లు
- పాఠశాల విద్య- 29,909 కోట్లు
- బీసీ సంక్షేమం- రూ. 3907 కోట్లు
- మైనార్టీ సంక్షేమం- రూ. 4376 కోట్లు
- ఎస్టీ సంక్షేమం- 7557 కోట్లు
- దీపం పథకం- 895 కోట్లు
సంక్షేమానికి పెద్దపీట
- ఎస్సీ సంక్షేమం రూ.18,497 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.39,007 కోట్లు
- మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి రూ.4,285 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ.1,215 కోట్లు