HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Aimim Plans To Contest Polls In Andhra Pradesh

AIMIM Eye AP: ఏపీ రాజకీయాల్లోకి ఎంఐఎం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండగా సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ప్రచారం చేస్తున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 28-09-2023 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aimim Eye Ap
Aimim Eye Ap

AIMIM Eye AP: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండగా సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక జనసేన సడీచప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలిండియా మజ్లిస్ పార్టీ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది.

ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ, నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, సినీనటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన, కాంగ్రెస్, బీజేపీతో పాటు వామపక్ష పార్టీలు లెక్కల్లో ఉన్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎంఐఎం అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.జనసేన పార్టీ తెలుగుదేశంకు మద్దతు ఇస్తుండగా, బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు నాయుడు మొగ్గుచూపుతున్నప్పటికీ బీజేపీ హైకమాండ్ స్పందించకపోవడం కొసమెరుపు.

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఒవైసీ తనకు ఎనలేని మద్దతు తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబుపై విమర్శలు చేశాడు. నిజానికి ఎంఐఎం 2014లో 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది, కానీ 10,000 కంటే తక్కువ ఓట్లు సాధించింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం జనాభా కొంతభాగం ఉంది. దానిని క్యాష్ చేసుకోవాలని ఒవైసీ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 4.94 కోట్ల మంది జనాభాలో ముస్లిం ఓట్లు కూడా ఉన్నాయి. 175 మంది అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం జనాభా 3 శాతం నుండి 16.55 శాతం వరకు ఉంది.కర్నూలు జిల్లాలో అత్యధికంగా 16.55 శాతం ముస్లిం జనాభా ఉండగా, కడపలో 15.75 శాతం, గుంటూరులో 11.45 శాతం, అనంతపురంలో 10.47 శాతం మంది ఉన్నారు.ముస్లింలు ప్రాధాన్యమున్న ఇతర జిల్లాల్లో నెల్లూరు 9.73 శాతం, చిత్తూరు 9.53 శాతం, కృష్ణా 6.80 శాతం, ప్రకాశం 6.49 శాతం ఉన్నారు.

గత ఎన్నికల్లో మెజారిటీ ముస్లింలు జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచారని, ఈసారి కూడా జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలని భావిస్తున్నారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో ఎంఐఎం సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి మరింత సన్నిహితంగా ఉంది.ఎంఐఎం పార్టీ మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాలలో అసెంబ్లీ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయనున్నట్టు స్పష్టమవుతుంది.

Also Read: Pooja Hegde: క్రికెటర్ తో పూజాహెగ్డే పెళ్లి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIMIM
  • andhra pradesh
  • Asaduddin
  • chandrababu
  • cm jagan
  • contest
  • Janasena
  • Muslim population
  • tdp
  • ysrcp

Related News

YouTuber Ravan's remand extended again.

Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులు, దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ జ్యుడీషియల్ రిమాండ్‌ను గన్నవరం న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జోసెఫ్ గడువు ముగియడంతో, జైలు అధికారులు అతడిని వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిశీలించిన కోర్టు, రిమాండ్‌ను పొ

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

  • Egg prices skyrocket... hitting record levels.

    Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

  • High tension at Mudragada's residence; wife and supporters prevent daughter from entering.

    Mudragada Kranthi: ముద్రగడ నివాసం వద్ద హై టెన్షన్.. కూతురిని రానివ్వని భార్య, అభిమానులు

  • Deadline for 'SIR' extended in AP!

    Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!

Latest News

  • Sonam Wangchuk : సోనమ్ వాంగుక్ హెల్త్ బులిటెన్ విడుదల

  • Gold Price : వారం రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే?

  • Flash Floods in J&K : జమ్మూకశ్మీర్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం

  • Delivery Boys : ఇంట్లో ఆడవారు మాత్రమే ఉంటె డెలివరీ బాయ్స్ తో జాగ్రత్త!

  • The Odyssey : నోలన్ మ్యాజిక్.. ‘ది ఒడిస్సీ’కి భారీ కలెక్షన్స్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd