Sri Reddy: శ్రీరెడ్డికి బెయిల్.. కానీ
Sri Reddy : సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసుల్లో విశాఖలో నమోదైన కేసుకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చిత్తూరు కేసులో పిటిషన్‌ను కొట్టివేసింది. ఇతర జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
- By Kavya Krishna Published Date - 10:29 AM, Tue - 25 February 25

Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ సందర్భంగా, శ్రీరెడ్డికి వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా, రూ. 10 వేలతో 2 పూచీకత్తులు సమర్పించాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో శ్రీరెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు కొట్టివేసింది.
అనకాపల్లిలో నమోదైన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయిరోహిత్ వాదనలు వినిపిస్తూ, శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా అత్యంత అభ్యంతరమైన భాషను వాడినట్లు న్యాయస్థానానికి తెలిపారు. అనంతరం, న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాలలోని కేసుల సంబంధించి, శ్రీరెడ్డికి నోటీసులు ఇవ్వాలని , ఆమె వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Top 10 Tourist Places: దేశంలోని టాప్ -10 టూరిస్టు ప్రదేశాల్లో హైదరాబాద్ హవా
ఈ కేసులు సంబంధించి, శ్రీరెడ్డి వివిధ పోలీసు స్టేషన్లలో దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. విశాఖపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో షరతులతో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ, శ్రీరెడ్డికి కర్నూలు టూ టౌన్, కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్, విజయనగరం జిల్లా నెలిమర్ల రాణాలో నమోదైన కేసులలో పోలీసులు పెట్టిన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్షకు సంబంధించినవే కావడంతో, ఈ కేసుల్లో వివరణ తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.
శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత , వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ చేసిన అసభ్యకర పోస్టులపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన శ్రీరెడ్డికి ఈ విధంగా ఊరట దక్కింది.
MLC Elections : ఎమ్మెల్సీ ఓటు వేయలేకపోతున్న పవన్..ఎందుకంటే..!!