MLC Elections : ఎమ్మెల్సీ ఓటు వేయలేకపోతున్న పవన్..ఎందుకంటే..!!
MLC Elections : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు
- By Sudheer Published Date - 07:17 AM, Tue - 25 February 25

ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాడేపల్లి (మండల పరిషత్) స్కూల్లో ఈ నెల 27న వీరిద్దరూ ఓటు వేయనున్నారు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అధినేతలు, పార్టీ కీలక నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాత్రం ఈ ఎన్నికలలో ఓటు వేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం, ఆయన పట్టభద్రుడు కాకపోవడం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే పట్టభద్రుడిగా నమోదై ఉండాలి. పవన్ కల్యాణ్ విద్యా అర్హతలు ప్రస్తుత ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
Aegis Graham Bell Awards : ఫైనలిస్ట్‌గా కెమిన్ ఆక్వాసైన్స్ గుర్తింపు
ఇక, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా తాడేపల్లిలో నివాసం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన రాజకీయ నాయకుల ఓటింగ్ హక్కులపై చర్చ జరుగుతోంది. విద్యావంతుల ప్రతినిధులుగా ఎమ్మెల్సీలు ఎన్నికవుతుండటంతో ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది.