HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Young Woman Climbed Mount Kilimanjaro Cm Chandrababu And Pawan Kalyans Banner Display

Kilimanjaro : కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన యువతి.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బ్యానర్ ప్రదర్శన!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-11-2025 - 12:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kilimanjaro
Kilimanjaro

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె కుసుమ టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. డిగ్రీ చదువుతున్న ఈ యువతి.. భారత పతాకంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ల ఫోటోలతో కూడిన బ్యానర్‌ను ప్రదర్శించి అభిమానం చాటుకుంది. కాగా, యూట్యూబ్‌లో చూసి కిలిమంజారో పర్వతం అధిరోహించాలనుకున్నట్లు కుసుమ తెలిపింది. పర్వతం ఎక్కేటప్పుడు ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించి కిలిమంజారో అధిరోహించినట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి పర్వతారోహణలో సత్తా చాటింది. డిగ్రీ చదువుతుండగానే.. టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. 19ఏళ్ల వయసులోనే శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పర్వతంపై భారత పతాకంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై ఉన్న అభిమానాన్ని కూడా చాటుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫొటోలు ఉన్న బ్యానర్ ప్రదర్శించింది.

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం దుగ్గుమర్రికి పెద్దన్న, నారాయణమ్మ దంపతుల కూమార్తె.. కె కుసుమ. ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ 14న 5,895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి.. శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. విమానాశ్రయంలో కుసుమకు.. కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన పర్యటన గురించి వివరాలు వెల్లడించింది కుసుమ.

యూట్యూబ్‌లో చాలా మంది పర్వతారోహకులు కిలిమంజారో పర్వతం ఎక్కడం చూశానని కుసుమ చెప్పింది. “యూట్యూబ్‌లో చూసి నేను కూడా అలా చేయాలని అనుకున్నాను. అయితే అది నా వల్ల అవుతుందో లేదో అన్న సందేహం కలిగింది. కానీ అనుకోకుండా కిలిమంజారో అధిరోహించే అవకాశం వచ్చింది. దీంతో నవంబరు 8న ఆఫ్రికాకు బయలుదేరాము. పర్వతం ఎక్కేటప్పుడు ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. వాటన్నింటినీ అధిగమించి.. కిలిమంజారో పర్వతం అధిరోహించడం ఎంతో అద్భుతంగా ఉంది. మా కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సహకారంతో పాటు వారు ఇచ్చిన ప్రోత్సాహం.. నేను ఈ ఘనత సాధించేలా చేశాయి” అని కె కుసుమ వెల్లడించింది.

పర్వతారోహణపై ఆసక్తితో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు కుసుమ తెలిపింది. తన సొంత ఖర్చులతోనే ఆఫ్రికాకు వెళ్లినట్లు కుసుమ వెల్లడించింది. ఈ ఘనత సాధించిన కుసుమను శింగనమల ఎమ్మెల్యే శ్రావణిశ్రీ అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.

గతంలో కూడా అనంతరపురం జిల్లాకు చెందిన ఓ బాలిక 9 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఆసియా ఖండం నుంచి చిన్నవయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా రిత్వికశ్రీ రికార్డులకెక్కడం గమనార్హం. కాగా ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anantapur
  • Andhrapradesh
  • AP CM Chandrababu
  • Deputy CM Pawan Kalyan
  • Kilimanjaro
  • Kusuma
  • nara lokesh

Related News

Scooty Theft

ఉండవల్లిలో దొంగలు చోరీ.. 20 స్కూటీల డిక్కీలను ఓపెన్‌ *** ?

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఇద్దరు ఆగంతకులు హల్ చల్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున వీరు చేసిన పనికి ఊరిజనం అవాక్కయ్యారు. పొద్దున్నే లేచి ఇంటి ముందు చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు దీనికి కారణమని గుర్తించారు. వారిని కనిపెట్టే పనిలో

  • Kanipakam temple

    అరుదైన రికార్డ్ సాధించిన కాణిపాకం దేవస్థానం.. ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

  • CM Chandrababu

    దేశంలో రెండో గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం చంద్ర‌బాబు!

  • Pensions A Day Early In Ap

    ఏపీలో ఒకరోజు ముందే పెన్షన్లు, సంబరాల్లో పెన్షన్ దారులు

  • Ap High Court

    ఏపీలో గ్రూప్‌-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్

Latest News

  • దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్

  • ఈరోజు సూపర్ మూన్ ఎన్ని గంటలకంటే !!

  • బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా దాడి చేసిన ప్రియురాలు

  • చలికాలంలో రాగి జావ తాగవచ్చా?..తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

  • ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..ఇక నేరుగా తల్లిదండ్రుల ఫోన్లకే హాల్‌టికెట్లు..

Trending News

    • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

    • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

    • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd