HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >14 People Burnt Alive In Horrific Road Accident In Markapuram

Markapuram Bus Accident: మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం.

  • Author : Vamsi Chowdary Korata Date : 26-03-2026 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Markapuram Bus Accident
Markapuram Bus Accident

మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయాలతో బయటపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల దగ్గర చీమకుర్తి వైపు నుంచి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా కనిగిరి, పామూరుకు చెందినవారిగా చెబుతున్నారు. అందరూ చూస్తుండగానే బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేసి, గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాలోని కలికిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఉదయం 5.30-6.30 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. రాయవరం పలకల క్వారీల దగ్గర బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో టిప్పర్‌ ఢీకొట్టినట్లు సమాచారం. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. టిప్పర్‌ అతివేగమే ఈ ఘటనకు కారణమని అంటున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. అయితే బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు 6304285613, 9985733999, 7989537285, 9703578434 అందుబాటులోకి తెచ్చారు.

మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

గతేడాది కర్నూలులో ప్రమాదం

గతేడాది అక్టోబర్‌లో కర్నూలు జిల్లా చిన్న టేకూరు దగ్గర కూడా ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది చనిపోయారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా జాతీయ రహదారి 44పై బస్సు బైక్‌ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో బయటకు రాలేకపోయారు. 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం నుంచి 22 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మళ్లీ ఇప్పుడు మార్కాపురం జిల్లాలోనూ బస్సులో మంటలు చెలరేగి 10 మంది చనిపోయారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • Markapuram
  • Markapuram bus accident
  • Markapuram Road Accident
  • Prakasam District
  • Private Travels Bus
  • Rayavaram
  • road accident

Related News

Markapuram Road accident pm modi

Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా

  • Private Travel Bus Road Acc

    Fire Accident: మార్కాపురంలో ట్రావెల్ బస్సు ప్రమాదం .. 10 మంది సజీవ దహనం

  • Iconic Towers

    Amaravati: అమరావతి లో ఐకానిక్ టవర్స్ నిర్మాణం వేగవంతం: మంత్రి నారాయణ

  • CM Revanth Reddy, Nara Lokesh Visits Dhulipalla Narendra Daughter Wedding

    Dhulipalla Narendra Daughter Wedding: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్

  • AP Education Minister Nara Lokesh

    Nara Lokesh: లోకేష్ శభాష్… జాతీయ జర్నలిస్ట్ రాజ్‌దీప్ ఫిదా.. ప్రశంసల వర్షం….!!

Latest News

  • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

  • Putin: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన పుతిన్.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..

  • Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

  • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

  • Peddi Tickets : పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

Trending News

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

    • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

    • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd