HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Will India Hand Over Sheikh Hasina To Bangladesh

Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగిస్తుందా..?

  • Author : Vamsi Chowdary Korata Date : 18-11-2025 - 5:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sheikh Hasina Pmmodi
Sheikh Hasina Pmmodi

బంగ్లాదేశ్‌లో మరణశిక్ష పడిన షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్.. ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను తక్షణమే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరణశిక్షపై స్పందించిన భారత్.. ఆమెను అప్పగించాలన్ని విజ్ఞప్తిపై మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే భారత్-బంగ్లాదేశ్ ప్రత్యర్పణ ఒప్పందం 2013లోని నిబంధనలు ఏం చెబుతున్నాయి.. షేక్ హసీనాను బంగ్లాదేశ్ సర్కార్‌కు అప్పగిస్తారా లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతుండగా.. షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించినందున.. ఆమెను తమకు అప్పగించాలని.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు షేక్ హసీనా అప్పగింత అంశం భారత్-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం భారత్‌లో ఉంటున్న హసీనాను వెంటనే తమకు అప్పగించాలని ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వం న్యూఢిల్లీని కోరింది.

2024 జూలైలో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థుల తిరుగుబాటును అణచివేసేందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు గాను.. హెలికాప్టర్లు, డ్రోన్‌లు, మారణాయుధాలను ఉపయోగించి విద్యార్థి నిరసనకారులను చంపడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై షేక్ హసీనాకు ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యర్పణ ఒప్పందం ప్రకారం.. శిక్ష పడిన షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్‌లను అప్పగించడం న్యూఢిల్లీకి తప్పనిసరి బాధ్యత అని పేర్కొంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వకం కాని చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది.

షేక్ హసీనాకు విధించిన మరణశిక్ష తీర్పుపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తాము తీర్పును గమనించామని తెలిపింది. అయినప్పటికీ.. షేక్ హసీనాను అప్పగించాలనే ఢాకా డిమాండ్‌పై మాత్రం స్పందించలేదు. పొరుగు దేశంగా.. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం.. శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం ఉండేలా చూస్తామని తెలిపింది. ఈ లక్ష్యాలను సాధించడానికి తామను నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.

ప్రత్యర్పణ అభ్యర్థనలను సాధారణంగా గౌరవించినప్పటికీ.. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగించే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. భారత చట్టాలు, ద్వైపాక్షిక ఒప్పందం రెండూ మన దేశానికి చాలా వెసులుబాటును కల్పిస్తున్నాయి. ప్రత్యర్పణ ఒప్పందంలోని ఆర్టికల్ 8 ప్రకారం.. నిందితుడిపై ఉన్న అభియోగాలు అన్యాయమైనవి లేదా అణచివేతకు గురిచేసేవి అని నిరూపించగలిగితే.. అప్పగింత అభ్యర్థనను తిరస్కరించే అవకాశం ఉంటుంది. షేక్ హసీనాపై ఉన్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవి కావచ్చనే కారణంతో భారత్ ఈ విజ్ఞప్తిని తిరస్కరించే అవకాశం ఉంది.

ఆర్టికల్ 6 ప్రకారం.. హత్య, ఉగ్రవాదం వంటి తీవ్రమైన నేరాలు మినహా రాజకీయ స్వభావం ఉన్న నేరాలకు నిందితులను అప్పగించడాన్ని తిరస్కరించవచ్చు. షేక్ హసీనాపై ఉన్న కొన్ని ఆరోపణలు దీని పరిధిలోకి రాకపోవచ్చని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యర్పణ చట్టం 1962లోని సెక్షన్ 29 భారత ప్రభుత్వానికి రాజకీయ ప్రేరేపిత అభ్యర్థనలను.. న్యాయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న అభ్యర్థనలను తిరస్కరించే అధికారాన్ని ఇస్తుంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • Former PM Sheikh Hasina
  • india
  • PMModi

Related News

Bangladesh To Lift Ban On IPL

IPL: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్

IPL Broadcast  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. క్రీడలను, రాజకీయాలను కలపదల్చుకోలేదని, ఈ అంశాన్ని పూర్తిగా వాణిజ్య కోణంలోనే చూస్తామని బంగ్లాదేశ్ కొత్త సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ప్రకటించ

  • Gas Effect 4yres

    War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

  • Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

  • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

  • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

  • ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd