Russian Plane Crashed: కూలిన విమానం.. 49 మంది స్పాట్ డెడ్, వెలుగులోకి వీడియో!
అమూర్ ప్రాంత గవర్నర్ వాసిలీ ఒర్లోవ్ విమానం అదృశ్యమైనట్లు ధృవీకరించారు. విమానంలో 5 మంది పిల్లలు, 6 మంది సిబ్బంది సహా మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన తెలిపారు.
- By Gopichand Published Date - 02:20 PM, Thu - 24 July 25

Russian Plane Crashed: రష్యాలోని సైబీరియాకు చెందిన అంగారా ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం ఒకటి అదృశ్యమై, చైనా సరిహద్దుకు సమీపంలోని అమూర్ ప్రాంతంలో కూలిపోయినట్లు (Russian Plane Crashed) వార్తలు వస్తున్నాయి. విమానం మండుతున్న శిథిలాలు టిండా నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ దిగువ భాగంలో కనుగొనబడినట్లు డెక్కన్ హెరాల్డ్ నివేదించింది. అయితే ఈ ప్రమాదంపై ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. విమానం కూలిపోయిన దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి.
ప్రమాద వివరాలు
అమూర్ ప్రాంత గవర్నర్ వాసిలీ ఒర్లోవ్ విమానం అదృశ్యమైనట్లు ధృవీకరించారు. విమానంలో 5 మంది పిల్లలు, 6 మంది సిబ్బంది సహా మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన తెలిపారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో సంబంధాలు కోల్పోయింది. విమానం ల్యాండింగ్ స్పాట్‌కు దగ్గరగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్ స్క్రీన్ నుండి అదృశ్యమైంది. దీంతో వెంటనే ప్రమాదం జరిగిందనే అనుమానం వ్యక్తమైంది.
Also Read: YS Jagan: కేటీఆర్‌కు జగన్ శుభాకాంక్షలు.. నా సోదరుడు తారక్ అంటూ ట్వీట్!
An-24 crash site in Russia's Far East seen from helicopter — social media footage
49 on board, including 5 children and 6 crew — no survivors reported
Malfunction or human error considered as possible causes https://t.co/pLMgFY7kBG pic.twitter.com/rU5VWLOnXH
— RT (@RT_com) July 24, 2025
అమూర్ ప్రాంత స్థానిక పోలీసులు, శోధన బృందాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టగా కొండపై ఉన్న అటవీ ప్రాంతం నుండి పొగలు వెలువడుతున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో విమానం మండుతున్న శిథిలాలు లభ్యమయ్యాయి.
AN-24 గురించి కీలక విషయాలు
కూలిపోయిన విమానం AN-24 (ఆంటోనోవ్-24) రకానికి చెందినది. ఇది సోవియట్ రష్యాలో తయారు చేయబడిన మధ్యస్థ దూరానికి ఎగిరే డబుల్ ఇంజిన్ టర్బోప్రాప్ ప్యాసింజర్ విమానం. 1959లో ఈ విమానం మొదటిసారిగా ఎగిరింది. తక్కువ దూరం ప్రయాణించే ప్రాంతీయ విమానయాన సేవలకు (రీజనల్ ఫ్లైట్‌లు) దీనిని రూపొందించారు. రష్యా, తూర్పు యూరప్, ఆసియాలోని దుర్గమ ప్రాంతాలలో ఎగరడానికి ఇది ప్రత్యేకంగా అనుకూలమైనది. దీని డిజైన్ తక్కువ దూరం రన్‌వేల నుంచి సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. 1500 నుండి 2,000 కిలోమీటర్ల దూరం వరకు ఎగరగల సామర్థ్యం ఉన్న ఈ విమానం, తరచుగా కార్గో విమానంగా, సైనిక రవాణా అవసరాల కోసం కూడా ఉపయోగించబడుతుంది. ప్రస్తుతం, రష్యా అధికారులు ప్రమాద కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే వెల్లడవుతాయి.