HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Chief Ys Jagan Birthday Wishes To Brs Working President Ktr

YS Jagan: కేటీఆర్‌కు జగన్ శుభాకాంక్షలు.. నా సోద‌రుడు తారక్ అంటూ ట్వీట్!

గతంలో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల ఆ సాన్నిహిత్యం కొంత దూరమయ్యిందని భావిస్తారు.

  • Author : Gopichand Date : 24-07-2025 - 2:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan
YS Jagan

YS Jagan: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కేటీఆర్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్ తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా.. “నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతీ అడుగులోనూ విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది. మీ కలలు సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ సందేశంలో కేటీఆర్‌ను ‘సోదరుడు’ అని సంబోధించడం, ఆయన లక్ష్యాలు నెరవేరాలని ఆకాంక్షించడం పట్ల ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు సానుకూలంగా స్పందిస్తున్నారు.

Also Read: Rishabh Pant: రిష‌బ్ పంత్‌కు మెటాటార్సల్ గాయం.. మాంచెస్ట‌ర్ టెస్ట్‌కు క‌ష్ట‌మేనా?

Wishing my brother Tarak a very Happy Birthday. May success follow you in every step, and may your dreams take shape with strength and clarity.@KTRBRS

— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2025

గతంలో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల ఆ సాన్నిహిత్యం కొంత దూరమయ్యిందని భావిస్తారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్‌తో వ్యక్తిగత స్థాయిలో సత్సంబంధాలను కొనసాగించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారాన్ని కోల్పోయి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేసిన ఈ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇది కేవలం ఒక మర్యాదపూర్వక శుభాకాంక్షగా భావించినా.. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆసక్తులున్న అంశాలపై రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు కొనసాగడానికి ఈ ట్వీట్ ఒక సంకేతంగా నిలవవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthday wishes
  • brs
  • BRS Working President KTR
  • ktr birthday
  • ys jagan
  • ysrcp

Related News

Kavithavsbrs

కవిత కు బిఆర్ఎస్ కు ఎక్కడ చెడింది?

BRSతో కవిత పూర్తిగా సంబంధాలు తెంచుకోవడానికి దారితీసిన అంశాలపై చర్చ జరుగుతోంది. కష్టకాలంలో పార్టీ అండగా లేదని కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ సమయంలో KTR, హరీశ్ అధికారులను అడ్డుకోవడం

  • Kavitha Crying

    కవిత కన్నీరు, బిఆర్ఎస్ ను మరింత పతనం చేయబోతుందా ?

  • MLC Kavitha Emotional in Legislative Council

    శాసన మండలిలో కన్నీరు పెట్టిన కవిత

  • Harishvsrevanth

    ప్రభుత్వానికి సవాల్ విసిరి తోకముడిచిన బిఆర్ఎస్

  • Hilt Policy Telangana Assem

    హిల్ట్ పాలసీపై రేపు అసెంబ్లీలో చర్చ

Latest News

  • బ్రోకలీ vs కాలీఫ్లవర్‌.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..?

  • మున్సిపల్ ఎన్నికలపై ఈసీ సన్నాహాలు..16 నాటికి ఓటర్ల తుది జాబితా

  • బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు

  • వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

  • మలబద్దకానికి సహజ పరిష్కారం: ఎండుద్రాక్ష–పెరుగు కలయికతో పొట్టకు ఉపశమనం

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd